AKG Center bomb blast : కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. "ఏకేజీ సెంటర్లోని మూడో అంతస్తులో నేను పనిచేసుకుంటున్నాను. రాత్రి 11:30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. గేటు వద్ద పొగ అలుముకుంది. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఖండించాలి" అని సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పీకే శ్రీమతి వెల్లడించారు.
రాహుల్ పర్యటన వేళ..
Rahul Gandhi Kerala visit : రెండు రోజుల వయనాడ్ పర్యటన కోసం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. శుక్రవారం కేరళకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబు దాడి జరగడం చర్చల్లో నిలిచింది. గత వారం.. వయనాడ్‌లోని రాహుల్ కార్యాలయంపై దాడి జరిగింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఇవీ చదవండి: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ? తారుమారు అవడానికి అదే కారణమా?
బ్రిటిషర్లకు వణుకు పుట్టించి.. విప్లవవీరుడు భగత్‌సింగ్‌కు స్ఫూర్తిగా నిలిచి..