ETV Bharat / bharat

రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తత - 8 మందికి గాయాలు - అసోం మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తత

అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 8మంది రైతులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Mizoram-Assam border
మిజోరం-అసోం సరిహద్దు
author img

By

Published : Jul 26, 2021, 6:38 PM IST

ఈశాన్య భారతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అసోం, మిజోరం రాష్ట్రాల సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనల్లో 8 మంది రైతులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు వివాదంపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో అమిత్​ షా భేటీ అయిన మరుసటి రోజే ఇలా జరగడం గమనార్హం.

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్​ చేశారు మిజోరం ముఖ్యమంత్రి జోరమ్​తంగా. "అమిత్​ షా జీ ఇది చూడండి.. దీనిని తక్షణమే అడ్డుకోవాలి" అని అందులో పేర్కొన్నారు. అసోం పౌరులతో పాటు రెండు కంపెనీల పోలీసు బృందాలు.. మిజోరం వైపు ఉన్న ప్రజలు, వాహనదారులపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసు అధికారులపై కూడా దాడి చేశారని జోరమ్​తంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. అమిత్​ షా ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం.

దీనిపై స్పందించిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. "జోరమ్​తంగా జీ.. మిజోరం ప్రజలు కర్రలు పట్టుకుని హింసను ఎందుకు ప్రేరేపిస్తున్నారో దర్యాప్తు చేయించగలరా? శాంతి భద్రతలను ప్రజలు చేతుల్లోకి తీసుకోకూడదని కోరుతున్నాం. రెండు ప్రభుత్వాల మధ్య శాంతియుతమైన చర్చల జరగాలని కోరుకుంటున్నాం" అని ట్వీట్​ చేశారు. "సీఎం పదవి నుంచి వైదొలగాలని.. అప్పటివరకు తమ ప్రజలు హింసను ఆపరని కోలసిబ్ జిల్లా​(మిజోరం) ఎస్​పీ కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడపగలం?" అని హిమంత ప్రశ్నించారు.

మిజోరం సీఎంతో తాను మాట్లాడినట్లు పేర్కొన్న హిమంత.. రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పెందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే దీనిపై మిజోరం సీఎంతో చర్చిస్తామన్నారు.

రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన షా

సరిహద్దు వివాద అంశమై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్​ షా మాట్లాడారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. శాంతిని నెలకొల్పెందుకు ఇద్దరు సీఎంలు ఒప్పందానికి రావాలని చెప్పారు. వివాదాస్పదమైన ప్రాంతం నుంచి పోలీసుల బలగాలను ఉపసంహరించాలని సూచించారు షా.

ఇవీ చూడండి:

మళ్ళీ తెరపైకి అసోం-మిజోరం సరిహద్దు వివాదం

అసోం-మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.