తమిళనాడు టెంకాసీ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. కల్లురానీ గ్రామంలో ఓ గుళ్లో జరిగిన వేడుకలో పాల్గొన్న కొందరు సమియాదీలు.. మానవ పుర్రె చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ.. వికృత నృత్యాలు చేశారు. అంతేకాక ప్రజల ముందే.. నరమాంసాన్ని తింటూ పూనకం వచ్చినవాళ్లలాగా ఊగిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. 10 మంది సమియాదీలు, ఆలయ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 102ఏళ్ల మర్రిచెట్టుకు పుట్టినరోజు వేడుకలు