ETV Bharat / bharat

పదేళ్ల వయస్సులో కుటుంబ భారాన్ని తలకెత్తుకుని.. - కరోనా

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​కు చెందిన ఓ పదేళ్ల అమ్మాయి.. రోడ్ల మీద బట్టలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి కరోనాతో చనిపోవడం వల్ల కుటుంబ భారాన్ని తన భుజాలకెత్తుకుంది.

ten-year-old-mahi
కుటుంబాన్ని పోషిస్తున్న చిన్నారి
author img

By

Published : Jun 19, 2021, 7:02 PM IST

ఓ పదేళ్ల అమ్మాయి రోడ్డు మీద బట్టలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్న తనంలో తన వాళ్ల భారాన్ని భుజాలకెత్తున్న ఆమెకు సాయం చేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. ఇంత చిన్నతనంలో ఆమెకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

కుటుంబాన్ని పోషిస్తున్న చిన్నారి
ten-year-old-mahi
బట్టలు కుడుతున్న మహి

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​ ఖీర్నీ బాగ్​కు చెందిన ప్రదీప్​ సక్సేనా అనే వ్యక్తి ఏప్రిల్​ 30న కరోనాతో మృతి చెందాడు. వృద్ధ తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు ఆయనే పెద్ద దిక్కు. రోడ్ల మీద బట్టలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. దీంతో తన పదేళ్ల కూతురు మహి.. కుటుంబ పోషణ బాధ్యతను తలకెత్తుకుంది. రోజూ రోడ్లమీద బట్టలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. బట్టలు అమ్మితేనే వారికి తిండి..లేకుంటే అంతే.

mahi
మహి
mahi
మహి తల్లి
mahi
కుటంబంతో మహి

చిన్నారి శ్రమ చూసిన కొందరు స్థానికులు అమ్మాయి కుటుంబానికి సాయం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాపార మండల్​ అధ్యక్షుడు..చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Education: అమ్మానాన్నలూ.. పిల్లల్ని ఇలా సిద్ధం చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.