చేపల వేటకు వెళ్లి తిరిగొచ్చిన మత్స్యకారులకు కాసులపంట పండింది. తాము తెచ్చిన చేపలు వేలం వేయగా రూ.కోటికిపైగా ధర పలికాయి. వారు తెచ్చింది అరుదైన రకానికి చెందిన చేపలు కావడమే కారణం. ఈ ఘటన బంగాల్లోని తూర్పు మెదినీపుర్ జిల్లా దిఘా ప్రాంతంలో జరిగింది.
సాధారణంగా ఈ రకం చేపలు కిలో ధర రూ.13వేలు ఉంటుందని స్థానిక మత్య్యకారులు వెల్లడించారు. ఒక్కో చేప ధర 33 నుంచి 35 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారుల వలలో ఇటువంటి చేపలు 33 చిక్కాయి. ఈ మొత్తం చేపలను వేలం వేయగా రూ.1.40 కోట్లు ధర పలికింది.
తెలియా భోలా రకానికి చెందిన ఈ చేపలు ఇదివరకు కూడా మత్స్యకారులకు చిక్కాయి.
క్యాప్స్యూల్ కవర్స్ తయారీలో ఈ చేప శరీర భాగాలు ఉపయోగించడం వల్ల వీటి ధర ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చూడండి : వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం- సీఎం ఫిదా