10.11PM
దిల్లీ చేరుకున్న రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. ఆయనకు దేశరాజధానిలో తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికి ఆహ్వానించారు.
9.12PM
సీఎం, మంత్రిమండలి ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
తెలంగాణలో నూతనంగా కొలువుతీరనున్న ముఖ్యమంత్రి, మంత్రిమండలి ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లుపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి విస్తృత ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి బందోబస్తు కల్పించాలన్నారు. ఎల్బీ స్టేడియానికి వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
8.52PM
దేశ రాజధానిలో రేవంత్ రాకకై భద్రతా ఏర్పాట్లు
రేవంత్ రెడ్డి రావడంతో దిల్లీలో అధికారులు రెండు చోట్ల భద్రత ఏర్పాట్లు చేశారు. అందులో ఒకటి ప్రస్తుతం రేవంత్ ఉంటున్న యమున అపార్టుమెంట్ అయితే, మరోకటి తెలంగాణ భవన్ శబరి బ్లాక్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
8.14PM
సీఎం ప్రమాణస్వీకారం ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం
డిసెంబర్ 07 న జరగనున్న సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశమయ్యారు. కార్యక్రమం ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో శాంతికుమారి చర్చించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్‌కుమార్, సీపీ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.
8.05PM
రేవంత్-స్వాగతం
పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ప్రత్యేక విమానంలో దిల్లీకి రేవంత్‌రెడ్డి పయనమయ్యారు. ఆయనతో వెంట షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, బలరాంనాయక్‌లు ఉన్నారు. దిల్లీలో రేవంత్‌కు తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలకనున్నారు. దిల్లీ విమానాశ్రయానికి ఇప్పటికే ప్రొటోకాల్ బృందం చేరుకున్నారు. అదేవిధంగా అధికారిక వాహనాలతో కూడిన కాన్వాయ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
7.35PM
రేవంత్‌రెడ్డి ట్వీట్
కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియమ్మ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి కృతజ్ఞతలంటూ రాసుకొచ్చారు. అదేవిధంగా పలువురు పార్టీ నాయకులైన కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఠాక్రేకు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దకాలంగా తన వెన్నంటే నడిచి, అండగా నిలిచిన కాంగ్రెస్ సైనికులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
06:50PM
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 7న సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
06:19PM
కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి రేవంత్‌కు పిలుపు
దిల్లీకి రావాలని రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. అధిష్ఠానం పిలుపుమేరకు రేవంత్ రెడ్డి దిల్లీకి బయలుదేరిన వెళ్లారు. కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడనున్నారు.
06:17PM
ముగిసిన కీలక భేటీ
దిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్‌ల కీలక భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది.
05:24PM
సీఎం పదవి రేసులో నేను కూడా ఉన్నా: ఉత్తమ్
ఇవాళ ఉదయం డీకే శివకుమార్‌ను దిల్లీలో కలిశానని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డీకేకు తన అభిప్రాయం తెలియజేశానన్నారు. తాను కాంగ్రెస్ నుంచే 7 సార్లు వరుసగా గెలిచానన్న ఆయన 30 ఏళ్ల నుంచి పార్టీలోనే ఉన్నానని తెలిపారు. సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిని ముగ్గురు, నలుగురు ఆశించడంలో తప్పు లేదన్న ఉత్తమ్, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సరైన పద్ధతి పాటిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఎలాంటి గందరగోళం లేదని, ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా కాకముందే సీఎం అభ్యర్థి ఖరారు ఆలస్యం అనడం సరికాదన్నారు.
05:21PM
మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్న నేతలు
దిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగుతోంది. వేణుగోపాల్‌తో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు.
04:58PM
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో భట్టి విక్రమార్క భేటీ
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో వేణుగోపాల్‌తో భట్టి సమావేశమయ్యారు. డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రే ఈ సమావేశానికి హాజరయ్యారు.
02:38
సీఎల్పీ భేటీలో సీఎం పేరును ప్రకటించనున్న డీకే శివకుమార్
ఇవాళ సాయంత్రం డీకే శివకుమార్ హైదరాబాద్‌కు రానున్నారు. అనంతరం సీఎల్పీ భేటీలో సీఎం పేరును డీకే ప్రకటించనున్నారు.
02.36 PM
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వైపే మొగ్గు చూపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని ఖరారు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు.
02.24 PM
రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెబుతున్న పలువురు అధికారులు
హైదరాబాద్‌లో 48 గంటలుగా ఎల్లా హోటల్‌లోనే రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు, ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. అక్కడ ప్రభత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు పలువురు అధికారులు చెబుతున్నారు. హోటల్‌లో రేవంత్ ఉండే గది వద్ద భద్రత పోలీసులు పెంచారు.
02.03 PM
దిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం - తెలంగాణ పరిణామాలపై చర్చించిన నేతలు
దిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించిన సమావేశం ముగిసింది. దీంతో మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. తెలంగాణ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాహుల్‌గాంధీ, వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరయ్యారు.
01.06 PM
దిల్లీలో మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ
దిల్లీలో మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ అయ్యారు.
01. 04 PM
సీఎల్పీ నిర్ణయాన్ని అధిష్ఠానానికి చెప్పటం వరకే నా బాధ్యత : డీకే శివకుమార్
సీఎల్పీ నేతను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని డీకే శివకుమార్ అన్నారు. ఏకవాక్య తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించామని పేర్కొన్నారు. సీఎల్పీ నిర్ణయాన్ని అధిష్ఠానానికి చెప్పటం వరకే తన బాధ్యతని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
12.58 PM
డీకే శివకుమార్‌తో ముగిసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ
దిల్లీలో డీకే శివకుమార్‌తో ఉత్తమ్ కుమార్ భేటీ ముగిసింది. అనంతరం ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరి పేరు ప్రకటించిన తనకు ఆమోదమేనని తెలిపారు. సీఎం అభ్యర్థిని ఖర్గే ఖరారు చేస్తారని అన్నారు. ఎంపీగా తాను రాజీనామా చేయాస్తానని స్పష్టం చేశారు. ఎప్పుడూ అనేది త్వరలో నిర్ణయించి చెప్తానని తెలిపారు.
12.32 PM
కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ
కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ అవ్వనున్నారు. సీఎం, ఉపముఖ్యమంత్రి అభ్యర్థులను మల్లికార్జున ఖర్గే ఖరారు చేయనున్నారు. మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలో కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం.
10.32 AM
దిల్లీలో డీకే శివకుమార్‌తో ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ
దిల్లీలో డీకే శివకుమార్‌తో ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
10.50 AM
మల్లికార్జునఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి ఎంపీల భేటీ
మల్లికార్జునఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి ఎంపీల భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
10.33 AM
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే
గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంలో ఇవాళ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో కాసేపట్లో పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
09.45 AM
కాంగ్రెస్ సీఎంను ఎంపిక చేసే క్రమంలో మరో ట్వీస్ట్
కాంగ్రెస్ సీఎంను ఎంపిక చేసే క్రమంలో మరో ట్వీస్ట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నాం ఖర్గేను కలవనున్నారు.
09.15 AM
కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠ
కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై కాంగ్రెస్‌లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కొత్త సీఎంను ఎంపికను ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అప్పగించారు. దీంతో వారి అభిప్రాయాన్ని అధిష్ఠానానికి చెప్పేందుకు డీకే శివకుమార్ దిల్లీ వెళ్లారు.