ETV Bharat / bharat

KTR: 'విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రకటన కేవలం దృష్టి మరల్చే చర్య' - విశాఖ ప్రైవేటీకరణపై కేటీఆర్ తాజా వ్యాఖ్యలు

KTR on Vizag Steel Plant Privatization : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్ఎస్ బయటపెట్టిందన్న ఆయన... దాని నుంచి దృష్టి మళ్లించేందుకే కేంద్రం స్పందించిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుకు వెంటనే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ పూర్తిగా ఆపేదాకా... బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేదాకా పోరాడతామన్నారు.

KTR
KTR
author img

By

Published : Apr 13, 2023, 9:47 PM IST

KTR on Vizag Steel Plant Privatization : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన కేవలం దృష్టి మరల్చేందుకేనని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్​ఎస్ బయటపెట్టిందన్న ఆయన.. ఈ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కొత్త డ్రామాకు కేంద్రం తెరతీసిందని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఆ ఒక్క ప్రకటనతో కేంద్రం వెనక్కి తగ్గింది : అదానీకి బైలదిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని బయటపెట్టినందుకే కేంద్రం కొత్త నాటకానికి తెరతీసిందని కేటీఆర్ అన్నారు. అదానీకి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని బైలదిల్లా గనుల అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా... విశాఖ ఉక్కు పరిశ్రమ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం కుట్రలు చేసిన తీరును బీఆర్​ఎస్ నిరంతరం లేవనెత్తుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టులో పాల్గొంటామన్న ఒక్క ప్రకటనతో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు.

కేసిఆర్ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందే : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో బీఆర్​ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చిత్తుశుద్ధిని చాటారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసిఆర్ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి రుజువైందన్నారు. విశాఖ ఉక్కుపరిశ్రమ నిర్ణయాన్ని పూర్తిగా విరమించడంతో పాటు.. బయ్యారం స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే వరకూ కేంద్రంపై నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్‌కు... సొంత గనులు ఇవ్వాలి : మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని... కేంద్రమంత్రి ఫగన్‌సింగ్‌ స్పష్టంగా చెప్పలేదని స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నాయకులు తెలిపారు. విశాఖలో మంత్రిని కలిసిన పరిరక్షణ పోరాట సమితి నాయకులు స్టీల్ ప్లాంట్ సమస్యలను వివరించారు. ప్రైవేటీకరణ ఆపాలంటే కేబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ ఆఫైర్స్‌లో... నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు... సొంత గనులు ఇవ్వాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.