Avinash Reddy Anticipatory Bail Petition కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికన్నాా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని, అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా! అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏప్రిల్ 17 నుంచి అనేక మలుపులు తిరిగిన ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తేలిపోనుంది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అరెస్టు చేసి, ఆ తర్వాతి రోజున అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీంతో గత నెల 17న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఎదుట రోజూ విచారణకు హాజరు కావాలని.. దర్యాప్తులో ప్రశ్నలు, సమాధానాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న న్యాయమూర్తి జస్టిస్ సురేందర్.. ఏప్రిల్ 25న విచారణ జరుపుతామని అప్పటి వరకూ అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టేసింది.
ఇదీ చదవండి : Rolls Royce Cbi Case: రోల్స్ రాయిస్‌కు షాక్.. అవినీతి ఆరోపణలపై సీబీఐ కేసు
ఏప్రిల్ 27న మళ్లీ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. 28న హైకోర్టుకు చివరి పనిదినం కావడంతో.. హడావిడిగా విచారణ జరపలేమన్న న్యాయమూర్తి.. వేసవి సెలవుల తర్వాత జూన్ 5కి వాయిదా వేశారు. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమైందన్న సంకేతాలతో.. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా వేసవి సెలవుల ప్రత్యేక హైకోర్టును ఆదేశించాలని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరపాలని ఈనెల 23న తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ విచారణ జరిపారు. ఈనెల 26, 27న రెండు రోజుల పాటు తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని.. అరెస్టు చేసి కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని సీబీఐ గట్టిగా వాదించింది. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు కీలక సాక్షుల వాంగ్మూలాలు సేకరించామని.. వాటిని ప్రస్తుత దశలో బయట పెట్టలేమని.. సీల్డు కవర్‌లో సమర్పిస్తామని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది.
ఇదీ చదవండి : మగాడి వేషం వేసుకుని వచ్చి కోడలి దాడి.. తీవ్ర గాయాలతో అత్త మృతి
హత్య జరిగిన రాత్రి, తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సప్ కాల్ మాట్లాడినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వాట్సప్‌లో అవినాష్ రెడ్డి ఎవరితో చర్చించారని సీబీఐని హైకోర్టు అడిగింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సప్ కాల్ మాట్లాడినట్లు మాత్రమే తెలుస్తుందని.. ఎవరితో మాట్లాడారో నిర్ధారించలేమని సీబీఐ వివరించింది. ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని భావిస్తున్నామని దర్యాప్తు సంస్థ తెలిపింది.వివేకా మరణ సంగతి పీఏ కృష్ణారెడ్డి బయటపెట్టకముందే సీఎం వైఎస్ జగన్‌కు తెలుసునన్న సీబీఐ... అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారేమో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది.
అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి, తండ్రి జైళ్లో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. ముందస్తు బెయిల్‌పై తేల్చే వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అరెస్టు తప్పించుకునేందుకే అవినాష్ రెడ్డి మెడికల్ పరిస్థితులు సృష్టించారని సీబీఐ వాదించగా.. తాము చెప్పింది తప్పయితే చర్యలు తీసుకోవచ్చునని అవినాష్ న్యాయవాది పేర్కొన్నారు. ఆ వివరణ రికార్డు చేసి తెలంగాణ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి :