Telangana HC verdict in Telugu : సుప్రీంకోర్టు, హైకోర్టుకి చెందిన వ్యవహారాలన్ని ఆంగ్లంలో ఉంటాయి. పిటిషన్ దాఖలు చేసిననప్పుడు అనుబంధపత్రాలు స్థానిక భాషలో ఉన్నా.. వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆంగ్లపత్రాలు మినహా మరే భాషలోనూ కోర్టులు స్వీకరించవు. అయితే స్థానిక భాషలకి ప్రాధాన్యం పెరుగుతున్నందున.. కోర్టులు మాతృభాషవైపు అడుగులువేస్తున్నాయి. తీర్పులు ప్రజలకు అర్ధం కావాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు.. స్థానిక భాషల్లోకి తర్జుమా చేయిస్తోంది.
ఈ తరుణంలో హైకోర్టులు స్థానిక భాషలో తీర్పు వెలువరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల్లో కేరళ తర్వాత.. తెలంగాణ హైకోర్టు మాత్రమే తీర్పు వెలువరించింది. ఈ ఫిబ్రవరిలో.. కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కింది న్యాయస్థానాల్లో ఒకరిద్దరు మినహా.. తెలుగులో తీర్పులు వెలువరించిన సంఘటనలు చాలా అరుదు. తెలుగులో తీర్పు ఇవ్వడం ద్వారా.. జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం కొత్త అధ్యాయనానికి నాంది పలికింది.
Telangana High Court : కక్షిదారులు, ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో వెలువరించామన్న ధర్మాసనం.. ఏ సందేహాలున్నా వాటి నివృత్తికి ఆంగ్లంలోని తీర్పును పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. కేసుకు సంబంధించిన అంశాలే కాకుండా తమకేసును రుజువు చేసుకునేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సమర్పించిన సుప్రీంకోర్టు తీర్పులను న్యాయస్థానం తెలుగులో అనువదించింది. భవిష్యత్‌లో తెలుగులో మరిన్ని తీర్పులు వెలువరించేందుకు.. ఇది తొలి అడుగుగా భాషాభిమానులు చెబుతున్నారు.
First Judgment in Telugu at Telangana HighCourt : సికింద్రాబాద్‌కి చెందిన వీరారెడ్డి కుమారులు చంద్రారెడ్డి, ముత్యంరెడ్డి అనే అన్నదమ్ముల మధ్య.. తల్లికి చెందిన భూ వివాదం కోర్టుకు చేరింది. తండ్రికి మచ్చబొల్లారంలో 13 ఎకరాలు ఉండగా.. 1974లో ఇద్దరు అన్నదమ్ములు, తల్లికి మధ్య ఆస్తిపంపకం జరిగింది. చంద్రారెడ్డికి 5, ముత్యంరెడ్డికి 4, తల్లికి 4.08 ఎకరాల భూ పంపకం జరిగింది. తల్లి సాలమ్మ మరణం తర్వాత.. ఆమెకు చెందిన భూ వివాదం న్యాయస్థానానికి చేరింది.
Telangana HighCourt Latest News: ఆ భూమి మొత్తం తనకే చెందుతుందని.. చంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించగా విచారించిన సివిల్ కోర్టు.. తల్లి రాసిన వీలునామాలో సందేహాలున్నాయని తేల్చి చెప్పింది. ఆ వీలునామా చెల్లదని పేర్కొంది. అంతేకాకుండా తల్లి ఆస్తి ఇద్దరు కుమారులకు సమానంగా చెందుతుందని తేల్చిచెప్పింది. దిగువ కోర్టు తీర్పుపై చంద్రారెడ్డి వారసులు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Telangana HighCourt first Judgment In Telugu : ముత్యంరెడ్డి మృతిచెందడంతో వారసులు కేసును కొనసాగించారు. ఇరుపక్షాల వాదనలు విన్న.. జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం.. కేవలం వీలునామాపై సందేహాలను వ్యక్తంచేయడమే కాకుండా అందుకు స్పష్టమైన కారణాలను దిగువ కోర్టు పేర్కొందని తెలిపింది. ఆ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రారెడ్డి అప్పీల్‌ను కొట్టివేసింది.
ఇవీ చదవండి: