తెలంగాణ ఎంసెట్ - 2023 పరీక్షలు మే 10 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- తెలంగాణలో మే 10 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
- మే 10, 11 తేదీల్లో ఫార్మా, అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తారు.
- మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు.
- ఒక్క నిమిషం లేటైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- తెలంగాణలో 104 పరీక్షా కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేశారు.
- అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ పరీక్షను 1,15,361 మంది విద్యార్థులు రాస్తున్నారు.
- పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. అందువల్ల వేళ్లకు గోరింటాకు వంటివి పెట్టుకోకపోవడం ఉత్తమం.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లే వారి వద్ద నలుపు లేదా నీలం ఇంక్ పెన్ను, హాల్ టికెట్ ఇంకా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ పత్రం, గుర్తింపు కార్డు మాత్రమే ఉండాలి.
- అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. కళాశాల ఐడీ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ, పాస్ పోర్టులలో ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
- మొబైల్ ఫోన్, చేతి గడియారం, కాలిక్యులేటర్, లాగ్ బుక్స్ వంటివాటితోపాటు ఏ ఎలక్ట్రానిక్ వస్తువును కూడా అనుమతించరు.
- గతంలో ఇంటర్ మార్కులకు ఎంసెట్లో వెయిటేజీ ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటర్ మార్కుల వెయిటేజీ నిబంధనను తొలగించారు.
- ఎంసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ర్యాంక్ ఇస్తారు.
- తెలంగాణలో మొత్తం 1 లక్షా 5 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 70 వేల సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.
- స్థానికత కలిగిన అభ్యర్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85 శాతం సీట్లు రిజర్వ్ చేశారు. వీరికి ఫీజు రీయింబర్స్ మెంట్ సౌకర్యం ఉంటుంది. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.
- తెలంగాణ ఎంసెట్ రాసే విద్యార్థులు.. 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ రెండేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలి. అప్పుడే వారిని లోకల్ గా పరిగణిస్తారు.
- ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ లో ప్రకటిస్తారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు.
- ఫలితాల తర్వాత విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కోర్సు, కళాశాల, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు.
- సీటు కేటాయించిన తర్వాత.. సదరు అభ్యర్థి సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.
ఇదీ చూడండి :