ETV Bharat / bharat

CM KCR Speech at TS Formation Day 2023 : 'నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ' - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు

Telangana Formation Day CM KCR Speech 2023 : నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తెచ్చామని తెలిపిన సీఎం.. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నలుదిశలా వ్యాపించిందని తెలిపారు. ఈ క్రమంలోనే దశాబ్ద కాలం ముంగిట నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సి న అత్యున్నత శిఖరాలు ఎన్నో ఉన్నాయని.. తన శరీరంలో సత్తువ ఉన్నంత వరకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

CM KCR Speech at TS Formation Day 2023
CM KCR Speech at TS Formation Day 2023
author img

By

Published : Jun 2, 2023, 12:23 PM IST

Updated : Jun 2, 2023, 2:35 PM IST

నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణ

KCR Speech on Nine Years of Telangana Journey : రాష్ట్ర నూతన సచివాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ.. నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్రను, పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు.

CM KCR on Telangana Formation Day : ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని కేసీఆర్‌ గుర్తు చేశారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్న ఆయన.. మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. ఆ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయన్న సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి ప్రయాణం మొదలైందని.. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వివరించారు. దేశానికే దిక్సూచిగా మారిన మన తెలంగాణ ప్రగతిని చాటుదామని స్పష్టం చేశారు.

Telangana Formation Day at Secretariat : నేటి నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయని.. ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన రోజు ఏ రంగంలో చూసినా విధ్వంసమే అన్న ఆయన.. నేడు అస్పష్టతలు, అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నామని తెలిపారు. దేశంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగిందని వివరించారు. ఈ క్రమంలోనే 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా తానొక వాగ్దానం చేశానని గుర్తు చేసిన కేసీఆర్‌.. రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చానన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దశాబ్ద కాలం ముంగిట నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సి న అత్యున్నత శిఖరాలు ఎన్నో ఉన్నాయని.. తన శరీరంలో సత్తువ ఉన్నంత వరకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Telangana Decade Celebrations at Secretariat : రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందన్న కేసీఆర్‌.. తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధితో పెద్ద రాష్ట్రాలను దాటామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో మనదే ప్రథమ స్థానమని.. ఎత్తిపోతల పథకాలతో బీడు భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని వివరించారు. తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ చరమగీతం పాడిందన్న సీఎం.. మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయని గుర్తు చేశారు. మన నగరాలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్నాయని.. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తోందని చెప్పారు.

వచ్చే నెలలో 'గృహలక్ష్మి' ప్రారంభం..: ఈ క్రమంలోనే నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. దశాబ్ది ఉత్సవాల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. వేడుకల వేళ.. పోడు భూములకు పట్టాలు ఇస్తామని.. ఆ భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు, 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామని.. గృహలక్ష్మి కింద మూడు దశల్లో రూ.3 లక్షలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగంలో స్వర్ణయుగమని కేసీఆర్‌ పేర్కొన్నారు. పాత సాగునీటి ప్రాజెక్టులను ఆధునికీకరించామని.. సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టమన్న ఆయన.. 20కి పైగా రిజర్వాయర్లతో నేడు రాష్ట్రం పూర్ణకలశమైందన్నారు. కోటీ 25 లక్షలకు సాగునీరు స్వప్నం త్వరలోనే సాకారం కానుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి..

TS Formation Day 2023 : 'రానే రాదన్న తెలంగాణను సాధించి.. కానే కాదన్న అభివృద్ధిని చేసింది.. కేసీఆర్‌'

Telangana Formation Day Wishes : 'అద్భుత నైపుణ్యాలు.. సాంస్కృతిక వైభవం తెలంగాణ సొంతం'

Last Updated : Jun 2, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.