ETV Bharat / bharat

అసెంబ్లీలో తొలిరోజు 100 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - బీజేపీ సభ్యుల గైర్హాజరు - BJP chief on Protem Speaker Akbaruddin Owaisi

Telangana Assembly Oath Swearning : రాష్ట్ర శాసనసభ కొలువు దీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌, ఎంఐఎం సభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. మొత్తంగా వంద మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయని ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రి కేటీఆర్​ హాజరుకాలేకపోయారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపికను నిరసిస్తూ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.

Telangana Assembly Session 2023
Telangana Assembly Oath Swearning
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 12:13 PM IST

Updated : Dec 9, 2023, 7:39 PM IST

Telangana Assembly Oath Swearning : రాష్ట్ర మూడో శాసనసభ కొలువు దీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రొటెమ్‌ స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌ తర్వాత శాసనసభను నిర్వహించారు.

సభ ప్రారంభానికి ముందు అందరు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరినీ పేరుపేరున పలకరించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు ఒక్కొక్కరే ప్రమాణస్వీకారం చేశారు. ఇలా 100 మంది శాసనసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా సింగరేణి కార్మికుడిలా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ వచ్చి ఆకట్టుకున్నారు.

బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

EX CM KCR Absent For Oath Swearing : మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆయన కోరారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ సహా పలువురు గులాబీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయని ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేయలేదు.

BJP State Chief On AKbaruddin Owaisi : శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరని తేల్చి చెప్పారు. రెగ్యులర్ సభాపతి ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు.

గన్‌పార్క్‌వద్ద నివాళులర్పించి శాసనసభ వద్దకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనందున మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం లేదని పోలీసులు తెలపడంతో బీజేపీ శాసన సభ్యులు వెనుదిరిగారు. ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్న కారణంగా తాము ఎవరం ప్రమాణ స్వీకారానికి రావడంలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) నిన్న ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవాళ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభను ఈనెల 14కు వాయిదా వేశారు. అదేరోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్​గా ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​ కుమార్​ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. మరోవైపు ఇటీవల ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారి రాజీనామాలను ఆమోదించారు.

Telangana Assembly Oath Swearning అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్​ రెడ్డి - మల్కాజ్​గిరి ఎంపీగా రాజీనామా

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా - కాంగ్రెస్, మజ్లిస్​ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న కిషన్​రెడ్డి

Last Updated : Dec 9, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.