తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నాడిని అంచనా వేసిన పలు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడిస్తున్నాయి. పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీ సంస్థ (పీటీఎస్ గ్రూపు) వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్.. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ఆ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్ 35 నుంచి 40 స్థానాల వరకు గెలుపొందొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 70 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేయగా.. బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం 6 నుంచి ఏడు, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీల వారీగా పరిశీలించినట్లయితే..
- ఆదిలాబాద్ - బీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ 4 నుంచి 6, బీజేపీ 2 నుంచి 4, ఇతరులకు ఒకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా - బీఆర్‌ఎస్‌కు 3 నుంచి 5, కాంగ్రెస్ 3 నుంచి 4, బీజేపీకి 1 నుంచి 2,
- కరీంనగర్ జిల్లా - బీఆర్‌ఎస్ 2 నుంచి 4, కాంగ్రెస్ 9, బీజేపీ 2
- మెదక్ జిల్లా - బీఆర్‌ఎస్ 4 నుంచి 6, కాంగ్రెస్ 4 నుంచి 6,
- మహబూబ్‌నగర్ జిల్లా - బీఆర్‌ఎస్ 2 నుంచి 4, కాంగ్రెస్ 9 నుంచి 12
- రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ 5 నుంచి 7, కాంగ్రెస్ 5 నుంచి 7, బీజేపీ 2
- హైదరాబాద్ - బీఆర్ఎస్ 5 నుంచి 7, కాంగ్రెస్ 2 నుంచి 4, బీజేపీ 1 నుంచి 2, వరంగల్ - బీఆర్‌ఎస్ 3 నుంచి 5, కాంగ్రెస్‌కు 7 నుంచి 9
- నల్గొండలో బీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్‌కు 9 నుంచి 11
- ఖమ్మంలో బీఆర్‌ఎస్ 2, కాంగ్రెస్‌కు 7 నుంచి 9, ఇతరత్ర 1
ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే ప్రకారం.. బీఆర్‌ఎస్‌కు 41-49, కాంగ్రెస్‌కు 58-67, బీజేపీ 5-7, ఇతరులు 7 నుంచి 9 వరకు రావచ్చని పేర్కొన్నారు. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ 39.58 శాతం, కాంగ్రెస్ 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది.