ETV Bharat / bharat

తెలంగాణ ఎన్నికల్లో వారసుల హవా- గెలిచిందెవరు? ఓడిందెవరు? - కల్వకుంట్ల సంజయ్​

Telangana Assembly Election Results 2023 Political Leaders Varasalu : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ విజయ దుందభి మోగించింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలువురు వారసులు.. ఎంట్రీ ఇచ్చారు. మరి అందులో గెలిచిందెవరు..? ఓడిందెవరో ఈ స్టోరీలో చూద్దాం..

telangana varasulu
telangana varasulu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:14 PM IST

Telangana Assembly Election Results 2023 Political Leaders Varasalu: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం​ గాలి వీచింది. రెండు సార్లు అధికారంలో కొనసాగిన భారత రాష్ట్ర సమితి- బీఆర్​ఎస్​ 40 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కన్నా(64) ఎక్కువ సాధించిన కాంగ్రెస్​ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలువురు వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరి అందులో గెలిచిందెవరు? ఓడిందెవరో ఈ స్టోరీలో చూద్దాం..

డాక్టర్‌.. ఎమ్మెల్యేగా..: మెదక్‌ స్థానం నుంచి 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్‌ విజయం సాధించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలిచారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడైన రోహిత్‌రావు మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. రెండు గోల్డ్‌ మెడల్స్‌ సైతం సాధించారు. హైదరాబాద్‌లో వైద్యుడిగా ఉంటూనే మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మెదక్‌ నుంచి రోహిత్‌కు బీఆర్​ఎస్​ టికెట్‌ ఇవ్వాలని మైనంపల్లి హన్మంత్‌రావు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్​ఎస్​ అందుకు నిరాకరించింది. దీంతో తండ్రీకుమారులిద్దరూ గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కోరుకున్న విధంగా మల్కాజిగిరి నుంచి హన్మంత్‌రావు.. మెదక్‌ నుంచి రోహిత్‌.. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. పద్మాదేవేందర్‌రెడ్డిపై రోహిత్‌ 9వేలకుపైన మెజారిటీతో విజయం సాధించారు.

Telangana Congress CM Swearing Ceremony : సాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ - రేపు సీఎం ప్రమాణ స్వీకారం

తండ్రి స్థానంలో తనయుడు: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్​ గెలుపొందారు. ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​పై విజయం సాధించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడి కోసం తన సీటు త్యాగం చేశారు. కాగా, కోరుట్ల నియోజకవర్గం కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కంచుకోట అని చెప్పొచ్చు. ఆయన ఇక్కడ్నించి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ క్యాడర్ అత్యంత బలంగా ఉంది.

ఇక కల్వకుంట్ల సంజయ్​ విషయానికి వస్తే.. 2004 నుంచి ప్రజాసేవలో ఉన్నారు. 2014 నుంచి ఎన్నికల సమయంలో కోరుట్ల పట్టణ ఇన్‌చార్జిగా పనిచేశారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మెగా వైద్యశిబిరాలు, ఉచిత శస్త్ర చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయించారు. రౌండ్‌టేబుల్‌ సంస్థ సహకారంతో పాఠశాలలు కట్టించారు. అయితే కుమారుడికి సీట్​ కన్ఫర్మ్​ చేసిన తర్వాత విద్యాసాగర్​ ఓ ట్వీట్​ చేశారు. "మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో మా అబ్బాయిని గెలిపిస్తామని మీకు మాట ఇస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. అన్నట్లుగానే కుమారుడిని కోరుట్లలో గెలిపించుకున్నారు.

కాంగ్రెస్​ను విజయతీరాలకు నడిపించిన మాస్టర్​ మైండ్​ ఎవరిది? ఆయన సక్సెస్​ మంత్ర తెలుసా?

గద్దర్​ కుమార్తె: రాష్ట్రంలో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కు సికింద్రాబాద్​ కంటోన్మెంట్‌లో బ్రేక్ పడింది. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో వెన్నెల ఓటమి చవి చూశారు. కాగా, ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణించడంతో ఆయన సేవలకు గుర్తుగా కాంగ్రెస్ పార్టీ ఆయన కుమార్తె వెన్నెలకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది. మరోవైపు కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో ఆయన కుమార్తె లాస్య నందితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఇద్దరు తండ్రి సానుభూతితో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ కంటోన్మెంట్ ఓటర్లు మాత్రం సాయన్న కుమార్తె లాస్య నందితకు పట్టం కట్టారు.

Telangana Women MLAs List : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మహారాణులు వీరే - ఎంతమంది మహిళలు గెలిచారో తెలుసా?

'ప్రజల మదిలో మోదీ'- చెక్కుచెదరని 'హిందుత్వ' పవర్! 2024లో బీజేపీని అడ్డుకునే 'శక్తి' ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.