ETV Bharat / bharat

ఇట్స్ పోలింగ్ టైమ్ - 3.26 కోట్ల మంది సిరాచుక్కతో తీర్పు రాసే సమయం

Telangana Polling 2023 : శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. మూడు కోట్లా 26 లక్షలకుపైగా ఓటర్లు.. తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పూర్తికానుంది.

Telangana Assembly Elections 2023
Telangana Polling 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 7:18 AM IST

ప్రారంభమయిన ఓటింగ్​ ప్రక్రియ సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలపై మరింత నిఘా

Telangana Assembly Election Polling 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. చెన్నూరు, సిర్పూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, మంథని, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్​ ముగియనుంది.

Telangana MLA Candidates Details 2023 : శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. బీఆర్ఎస్​ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా.. మిత్రపక్షం జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు.

ఓట్ల పండుగకు రాష్ట్రం ముస్తాబు - పోలింగ్‌ కోసం సర్వం సిద్ధం

Polling Centers in Telangana State Wide : రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి రవాణా సదుపాయంతో పాటు 21,686 వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంచారు. 80 ఏళ్లుపైబడిన వారికి కూడా ఉచిత రవాణా(Free Traveling for Old Voters) సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

Telangana Polling Employees 2023 : 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు, 119 కేంద్రాలను పూర్తిగా యువ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఆరుగురు సిబ్బంది(Telangana Polling Employees 2023 ) ఉంటారు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు ఏపీఓలు, ఒక ఓపీఓ, ఒక బీఎల్ఓ, ఒక వాలంటీర్ విధుల్లో ఉంటారు. 43,171 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు.. 1,32,596 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్లు.. 12,909 మంది మైక్రో అబ్జర్వర్లు.. 4,039 మంది రూట్ ఆఫీసర్లు.. 3,803 మంది సెక్టార్ ఆఫీసర్లు.. విధుల్లో ఉన్నారు. 1251 మంది ఫ్లయింగ్ స్క్వాడ్.. 1316 మంది స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్.. 234 వ్యయ పరిశీలనా బృందాలు.. 184 మంది సహాయక వ్యయ పరిశీలకులు విధుల్లో ఉన్నారు. మొత్తంగా 2,00,433 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.

ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ - 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

Telangana Voters : రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,2,799. అందులో పురుషులు 1,62,98,418 మంది కాగా.. మహిళలు 1,63,01,705 మంది ఓటర్లుగా ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406 కాగా.. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 9,99,667. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్(Polling Centers) కోసం వినియోగిస్తున్నారు. గరిష్ఠంగా ఎల్బీనగర్‌లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 75,464 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.

EC Arrangements in Telangana for Polling : 44,828 కంట్రోల్ యూనిట్లు, 49,460 వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈవీఎం యంత్రాలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిచేసేందుకు వీలుగా 400కుపైగా ఈసీఐఎల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 12,570 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.