అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు భయపడి ఓ తహసీల్దార్ ఏకంగా 20 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను తగల బెట్టిన ఘటన రాజస్థాన్‌లో బుధవారం రాత్రి జరిగింది.
సిరోహి జిల్లాలో కల్పేశ్ కుమార్ జైన్.. తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఆయన తరఫున ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్వత్ సింగ్ పట్టుబడ్డారు. పర్వత్ సింగ్ ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటికి వెళ్లారు. అయితే ఏసీబీ అధికారుల రాకను గమనించిన తహసీల్దార్ కల్పేశ్ కుమార్... ఇంటి తలుపులు మూసేసి దాదాపు 20 లక్షల రూపాయల నోట్లను తగులబెట్టినట్లు అధికారులు తెలిపారు.
స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించగా... లక్షా 50 వేల రూపాయలు దొరికినట్లు చెప్పారు. ఆర్‌ఐ పర్వత్ సింగ్‌తో పాటు... తహసీల్దార్ కల్పేశ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'కొవిన్'లో మార్పులు- రెండో డోసు షెడ్యూలింగ్ బంద్!