ETV Bharat / bharat

ఆ సంప్రదాయానికి బ్రేక్​.. గురువారం ఎర్రకోటలో మోదీ ప్రసంగం ప్రత్యేకత ఇదే! - మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద గురువారం చేయనున్న ప్రసంగం ప్రత్యేకతను సంతరించుకుంది. సిక్కుల మతగురువు తేగ్​ బహుదూర్​ జయంతి సందర్భంగా చేయనున్న ఈ ప్రసంగం.. సంప్రదాయానికి భిన్నంగా రాత్రిపూట నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

modi
మోదీ
author img

By

Published : Apr 20, 2022, 6:41 AM IST

PM Modi Red Fort Speech: సిక్కుల మతగురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే చోటు వద్ద కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగాన్ని నిర్వహించనున్నారు. తేగ్​ బహుదూర్​కు మరణశిక్షకు అప్పటి ముఘల్​ రాజు ఔరంగజేబ్​ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

గురువారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రధాని మోదీ రాత్రి 9.30 గంటలకు ప్రసంగించనున్నారు. మతసామరస్యంపైన ప్రధాని ప్రసంగించనున్నట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల సమయంలో కాకుండా ఈ ప్రాంతంలో ప్రధాని ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు.. 2018లో స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఆజాద్​ హింద్​ ప్రభుత్వం స్థాపించి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసగించారు. అయితే అప్పుడు ఆ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటలకు నిర్వహించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు సహా సిక్కు గురువులు హాజరుకానున్నారు. 400 మంది సిక్కు జతేదార్లకు చెందిన కుటుంబీకులను కూడా కేంద్రం ఆహ్వానించింది. అంతేకాదు.. నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులతో 'షాబాద్ కీర్తన'ను నిర్వహించున్నారు.

భారీ భద్రత... ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమందికి పైగా దిల్లీ పోలీసులు, ఇతర బలగాలతో బహుళ అంచెల భద్రతావలయాలు ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎర్రకోటలో వందకుపైగా సీసీటీవీలను ఇప్పటికే ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి 24 గంటలపాటు సీసీటీవీలను పర్యవేక్షిస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : సరికొత్త పంథాలో చోరీ.. కారు ముందు నోట్లు విసిరి.. తెలివిగా బురిడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.