Gang Rape IN Punjab: పంజాబ్ తల్వారాలో దారుణం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బాలికకు తల్వారాలోని ఓ వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో అతడిని కలవడానికి తల్వారా వచ్చిన ఆమె.. ఆ వ్యక్తికి ఫోన్ చేసింది. బస్టాండ్ వెనుక ఉన్న కారులో ఎక్కమని అతను ఆమెకు సూచించాడు.
బాలిక అతను చెప్పినట్టుగానే కారులోకి ఎక్కింది. అయితే అప్పటికే కారులో ఉన్న నలుగురు ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను.. నిర్మాన్యుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం తిరిగి ఆమెను బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: భర్త పైశాచికం.. భార్య న్యూడ్ వీడియోలు చిత్రీకరించి..