ETV Bharat / bharat

విద్యార్థుల బడి బాట- ఏనుగులతో ఉపాధ్యాయుల స్వాగతం

author img

By

Published : Nov 2, 2021, 11:38 AM IST

Updated : Nov 2, 2021, 3:30 PM IST

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన వేళ పలు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత విద్యార్థులు బడి బాట పట్టడం వల్ల పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తాజాగా పాఠశాలలు తెరుచుకోగా విద్యార్థులకు అక్కడి ఉపాధ్యాయుల నుంచి అదిరిపోయే స్వాగతం లభించింది.

schools across india reopened
విద్యార్థుల బడి బాట- ఉపాధ్యాయుల అదిరిపోయే స్వాగతం
విద్యార్థుల బడి బాట- ఉపాధ్యాయుల అదిరే స్వాగతం

కరోనా కారణంగా సుదీర్ఘ కాలంపాటు ఇళ్లకు పరిమితమైన చిన్నారులకు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా వినూత్న స్వాగతం లభిస్తోంది. తమిళనాడు శివగంగైలోని ఓ ప్రాథమిక పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఓ గజరాజు ఘన స్వాగతం పలికింది. స్థానికంగా గల షణ్ముగనాథన్‌ ఆలయంలో ఉండే..గజరాజుతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆహ్వానం పలికించారు. కరోనా వ్యాప్తి తరువాత తొలిసారి పాఠశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ఈ అరుదైన స్వాగతాన్ని అందించారు.

teachers welcomed students in a grand way as schools reopened
చాలా కాలం తర్వాత విద్యార్థుల బడి బాట- ఉపాధ్యాయుల అదిరే స్వాగతం

అటు కేరళ కోజికోడ్‌లోని MIUP పాఠశాల విద్యార్థులకు ఇదే తరహాలో ఘనస్వాగతం లభించింది. సుదీర్ఘ విరామం తరువాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మేళ తాళాలతో ఆహ్వానం పలికింది. విద్యార్థులపై పూలు చల్లుతూ ఉపాధ్యాయులు వారిలో ఉత్సాహాన్ని నింపారు.

చాలా రోజుల తర్వాత విద్యార్థులు పాఠశాలకు రావడంతో వారిలో ఆందోళన, నిరాసక్తి, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి వినోద భరితమైన ఘన స్వాగతం పలకటం ద్వారా విద్యార్థుల్లో ఆ ఒత్తిడిని దూరం చేయవచ్చని ‌అభిప్రాయపడుతున్నారు. తద్వారా వారికి చదువుపై తిరిగి ఆసక్తి పెంచేందుకు వీలు పడుతుందని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి: India Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Last Updated : Nov 2, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.