ETV Bharat / bharat

యూపీలో టీచర్ల మృతి పట్ల ప్రియాంక ఆగ్రహం - యోగి సర్కార్'

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయత్​ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన టీచర్లు, సిబ్బంది కరోనాతో మరణించటంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. వారికి సరైన వైద్యసదుపాయాలను అందించే విషయంలో విఫలమైందని.. అంతేకాక మరణించిన వారి గౌరవాన్ని దిగజార్చుతోందని దుయ్యబట్టారు.

priyanka gandhi
ప్రియాంక గాంధీ వాద్రా
author img

By

Published : May 19, 2021, 2:19 PM IST

ఉత్తర్​ప్రదేశ్ పంచాయత్ ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులు, సిబ్బంది కొవిడ్​ బారిన పడి మరణించటంపై కాంగ్రెస్​ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి వైద్యసదుపాయం అందించలేక యూపీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. మృతుల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.

అంతకుముందు కొవిడ్ మరణాలపై మాట్లాడిన యూపీ ప్రాథమిక శిక్షా సంఘ్ అధ్యక్షుడు డాక్టర్​. దినేశ్ చంద్ర శర్మ.. యూపీ పంచాయత్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన వారిలో ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు 1,621 టీచర్లు, సిబ్బంది కొవిడ్ తో మరణించారని తెలిపారు.

ముగ్గురే..

అయితే ఆ లెక్కల్లో వాస్తవం లేదని.. కేవలం ముగ్గురే మరణించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి : కరోనాపై పోరులో అమరులైన 700 మంది టీచర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.