కర్ణాటక రాయచూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. యూనిఫాంలో మలవిసర్జన చేశాడని ఓ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థి శరీరంపై వేడినీళ్లు పోసేశాడు. దీంతో విద్యార్థి శరీరం 40శాతం కాలిపోయింది.
సంతకళ్లూరులోని శ్రీగణమాతేశ్వర ప్రైమరీ పాఠశాలలో బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన బాలుడు.. లింగసుగూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెప్టెంబరు 2న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలుడిపై దాడికి పాల్పడిన రోజు నుంచి ఉపాధ్యాయుడు హుళిగెప్ప పాఠశాలకు రావట్లేదని సమాచారం. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.. ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కాలేదు. అతడిపై ఫిర్యాదు చేయవద్దని టీచర్ తరఫు పెద్ద మనుషులు బాలుడి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: మద్యం సేవించి స్కూల్‌కు టీచర్.. విద్యార్థులను తిడుతూ, కొడుతూ.. చివరకు
ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరమే: సుప్రీంకోర్టు