కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయుడికి పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు విద్యార్థులు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో జరిగింది.
సిరిగుప్పకు చెందిన 63 ఏళ్ల ఈశ్వరప్ప అనే ఉపాధ్యాయుడు కొవిడ్‌తో శనివారం చనిపోయారు. ఆయన పూర్వ విద్యార్థులే పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అంత్యక్రియలు వారే జరిపారు.
సిరిగుప్ప తాలుకాలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయునిగా సేవలందించారు ఈశ్వరప్ప. విద్యార్థులకు ఆయనంటే అమితమైన అభిమానం.
ఇదీ చూడండి: 'వైరస్ నుంచి కోలుకున్నా.. ఇంటికి వెళ్లను'