ETV Bharat / bharat

తేయాకు వ్యర్థాలతో వరల్డ్​ రికార్డ్​.. 365 సంస్థల లోగోలు సృష్టించి..

tea fluff artist: కాదేదీ కవితకు అనర్హం అనే సామెతను చక్కగా వంటబట్టించుకున్న ఓ యువతి.. కాదేదీ కళకు అనర్హం అనేలా చేసి చూపించింది. తేయాకును శుద్ధి చేయగా మిగిలిన వ్యర్థాలతో.. వివిధ సంస్థల లోగోలు తయారు చేసి యురేషియా వరల్డ్​ రికార్డ్​ సృష్టించింది. ఆమెనే ఉత్తర్​ప్రదేశ్​, వారణాసికి చెందిన రోష్ని యాదవ్​​.

tea
తేయాకు వ్యర్థాలతో చేసిన లోగో
author img

By

Published : Feb 9, 2022, 2:26 PM IST

tea fluff artist: ప్రతి భారతీయుడు రోజుకు సుమారు నాలుగు కప్పుల టీ తాగుతారు. అందుకే ఛాయ్ భారతీయుల జీవితంలో భాగమైపోయింది. తేయాకుకు అంతటి ప్రాముఖ్యత ఉంది. తేయాకే కాదు.. దానిని శుద్ధి చేయగా మిగిలిపోయిన వ్యర్థాలతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది ఓ యువతి. తేయాకు వ్యర్థాలతో వివిధ మీడియా సంస్థలు, బ్రాండ్ల లోగోలు తయారు చేసి ఔరా అనిపించింది. ఆమే ఉత్తర్​ప్రదేశ్​, వారణాసికి చెందిన రోష్ని యాదవ్​​.

tea fluff logo
వ్యర్థాలతో చేసిన లోగోలు

ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు, బ్రాండ్లకు చెందిన 365 లోగోలు తయారు చేసి యురేషియా వరల్డ్​ రికార్డు నెలకొల్పంది రోష్ని. కరోనా మహమ్మారి, లాక్​డౌన్​ సమయంలో చేసిన సేవలకు గౌరవంగా ఈటీవీ భారత్​ లోగోను తయారు చేసింది.

etv bhart logo
ఈటీవీ భారత్​ లోగో

తేయాకు వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసిన లోగోలను రోషిణి యాదవ్​.. భాదైని ఆదర్శ్​ శిక్షా మందిర్​లో ప్రదర్శనకు ఉంచారు. దీనిని అంతర్జాతీయ కళాకారిణి నేహా సింగ్​ ప్రారంభించారు.

tea
తేయాకు వ్యర్థాలతో చేసిన లోగో

"వివిధ సంస్థల లోగోల తయారీలో ఒకే రంగును ఉపయోగించా. అది దేశంలో వివిధ ప్రజలు, సంస్కృతులు ఉన్నా వారంతా భారతీయులమనే భావనను తెలియజేస్తుంది. కరోనా మహమ్మారి కాలంలో మీడియా సంస్థలు చేసిన సేవలకు గౌరవంగా వాటి లోగోలను రూపొందించా. లాక్​డౌన్​ సమయంలోనే ఈ లోగోలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది."

- రోష్ని యాదవ్​

బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం, మహాత్మ గాంధీ కాశీ విద్యాపీఠ్, సహా పలు పాఠశాలల​ విద్యార్థులు హాజరై ఈ ప్రదర్శనను తిలకించారు. యూరేసియా వరల్డ్​ రికార్డ్స్ ప్రతినిధులు హాజరై రోష్నికి సర్టిఫికెట్​ అందజేశారు.

రోష్ని యాదవ్​ 2020 లాక్​డౌన్​ సమయంలోనూ 101 దేశాలతో కూడిన రంగోళిని వేసి రికార్డును సృష్టించింది.

ఇదీ చదవండి: కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.