ETV Bharat / technology

సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అద్భుతమైన మైలేజ్.. అదిరే ఫీచర్లతో రూ.8 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే! - CARS UNDER 8 LAKH

కొత్త కారు కొనాలా?- టాప్​క్లాస్​ ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!

Cars Under 8 Lakh
Cars Under 8 Lakh (MARUTI DZIRE, MAHINDRA)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 2, 2024, 12:52 PM IST

Cars Under 8 Lakh: ఈ రోజుల్లో చాలా మంది తమ ఇంట్లో కారు ఉండాలని కోరుకుంటారు. అయితే కారు కొనడం అంత తేలికైన విషయం కాదు. కొత్త కారును కొనుగోలు చేసే ముందు దాని ఫీచర్లు, మైలేజీ, అవుట్ అండ్ ఇన్ లుక్ వంటి చాలా విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటితో కారు సరసమైన ధరకే మనకు అందుబాటులోకి రావాలని అనుకుంటాం. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో రూ.8 లక్షల లోపు అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటితో పాటు ఈ వాహనాల్లో అందిస్తున్న సేఫ్టీ, ఫీచర్లు, మైలేజీ వంటి వివరాలు మీకోసం.

Tata Nexon Smart (O): టాటా నెక్సాన్ స్మార్ట్​ (O) 5500 cc ఇంజిన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజిన్​తో కారు 88.2 PS పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 382 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఈ టాటా కారు పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలోనూ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 17 నుంచి 24 kmpl మైలేజీని ఇస్తుంది.

ఈ టాటా కారులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. అంతేకాక గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా అందుకుంది. దీంతో అదిరే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ కారును కొనాలనుకునే వారు కళ్లు మూసుకుని ఈ కారును కొనేయొచ్చు. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Mahindra XUV 3XO: మహింద్రా 'XUV 3XO' కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ కారులో అమర్చిన డీజిల్ ఇంజిన్ 86 kW పవర్, 300 Nm టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే పెట్రోల్ ఇంజిన్ 96 kW పవర్, 230 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 18 నుండి 21 kmpl మైలేజీని ఇస్తుంది.

మహింద్రా 'XUV 3XO' ఈ ఏడాదే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్నారు. ఇందులో స్కైరూఫ్ ఫీచర్‌ కూడా ఉంది. ఇక మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Maruti Dzire: ఈ మారుతి డిజైర్ అప్డేటెడ్ మోడల్ ఇటీవల మార్కెట్లోకి విడుదలైంది. మార్కెట్‌లో ఈ కారు ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్నారు. ఈ కొత్త డిజైర్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మారుతి మొట్ట మొదటి కారుగా నిలిచింది. ఇందులో సన్‌రూఫ్ కూడా ఉంది.

ఇక దీని ఇంజిన్ విషయానికొస్తే.. ఈ కారులో 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజిన్ ఉంది. అంతేకాక ఈ కారు CNG ఆప్షన్​లో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్‌ 24.79 kmpl మైలేజీని అందిస్తుంది. ఇక దాని CNG వేరియంట్ 33.73 km/kg మైలేజీని అందిస్తుంది. మార్కెట్లో ఈ కొత్త డిజైర్​ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా?- ఈ డిసెంబర్​లో లాంఛ్​ కానున్న టాప్​క్లాస్​ మొబైల్స్ ఇవే!

ప్రీమియం బైక్ కొనడం మీ కలా?- వెంటనే త్వరపడండి- త్వరలో వాటి ధరలు భారీగా పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.