TDP won three graduate MLC election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు.. టీడీపీ ఖాతాలోకి చేరాయి. తూర్పు, ఉత్తరాంధ్ర స్థానాల్లో విజయం సులువుగా మారినా, పశ్చిమ రాయలసీమ స్థానం మాత్రం.. ఇరు పార్టీల అభ్యర్దులను ముచ్చెమటలు పట్టించింది. మొదటి ప్రాధాన్య ఓట్లలో వైసీపీ అభ్యర్ది స్వల్ప మెజారిటితో ఉండగా, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో.. ఫలితం టీడీపీ వైపు నిలిచింది. క్షణక్షణానికి ఓట్ల లెక్కింపుతో టీడీపీ గెలుపు ఖాయం అనిపించేలా ఫలింతాలు ఉండటంతో.. ఒకనొక సందర్భంలో వైసీపీ అభ్యర్ది.. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. టీడీపీ అభ్యర్దే గెలవనున్నారనే సంకేతాలను ఇచ్చారు. దీంతో పశ్చిమ రాయల సీమ ప్రాంతంలో టీడీపీ అభిమానులు పెద్దఎత్తన సంబరాలు చేసుకున్నారు. అయితే, చివరి వరకు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకపోవడంతో.. తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన కౌంటింగ్ కేంద్రంలోని వైసీపీ ఏజెంట్లు.. ఓట్ల లెక్కింపు మరోసారి చేపట్టాలని ఆందోళనకు దిగారు. అటు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి సైతం నేలపై కూర్చుని.. ఓట్ల లెక్కింపు మరోసారి చేపట్టాలని డిమాండ్ చేశారు. వారిని శాంతింప చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. చివరకు వారు శాంతించడంతో.. టీడీపీ అభ్యర్ధి గెలిచినట్లుగా, అధికారులు ప్రకటించారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజక వర్గం (కడప - అనంతపురము - కర్నూలు) ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించినట్లు అధికారిక ప్రకటన చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఈ కౌంటింగ్ లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ తెలిపారు
దోబూచులాడిన విజయం: 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. మొత్తం 2,45,687 ఓట్లు పోలైనట్టు అధికారులు తెలిపారు. వీటిలో 2,26,448 ఓట్లు చెల్లనట్లు తేల్చారు. మొత్తం ఓట్లలో 19,239 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో అభ్యర్దుల గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును నిర్వహించారు. ఈ స్థానంలో 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో కనిష్ఠంగా ఓట్లు పొందిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. 33 మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 16మంది అభ్యర్థులు మిగిలారు. 33 మంది ఓట్ల లెక్కింపు తర్వాత వైసీపీకి 96,436, టీడీపీ 94,717 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థిపై 1,700 నుంచి 1,300కు వైసీపీ ఆధిక్యం పడిపోయింది. ఓట్లు తగ్గినట్లు తెలియడంతో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: