టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి - Fireworks store catches fire in latteri
తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల దుకాణంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా.. మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

టపాసుల దుకాణంలో మంటలు
తమిళనాడు వెల్లూర్ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టపాసుల దుకాణంలో ఆదివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దుకాణ యజమాని, ఆయన మనమళ్లు ఇద్దరు సజీవ దహనమయ్యారు.
ఈ ప్రమాదంలో దుకాణం మొత్తం కాలిబూడిదైంది. షాప్ సమీపంలోని 5 ద్విచక్ర వాహనాలకూ మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై మంటలు విస్తరించకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రసాయన కంపెనీలో మంటలు- ముగ్గురు మృతి