ETV Bharat / bharat

ఆవుపేడతో కొట్టుకున్న గ్రామస్థులు- అదే వెరైటీ! - తమిళనాడులో దీపావళి వేడుక

దీపావళి (diwali festival celebration) అంటే ఇళ్ల ముందు దీపాలు, రంగురంగుల విద్యుత్‌ కాంతులు, టపాసులు కాల్చుతూ ఆనందంగా జరుపుకుంటారు. కానీ తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని వినూత్నంగా చేసుకున్నారు. ఆవుపేడతో కొట్టుకుంటూ (indian cow dung festival) పండుగ జరుపుకున్నారు.

diwali festival celebration in india
ఆవుపేడతో దీపావళి పండుగ
author img

By

Published : Nov 7, 2021, 11:53 AM IST

పేడతో కొట్టుకుంటూ .. దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు

తమిళనాడులోని ఈరోడ్​ జిల్లాలో దీపావళి పండుగను (diwali festival celebration in india) వినూత్నంగా జరుపుకున్నారు. జిల్లాలోని గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్​హబ్బా అనే ప్రత్యేక కార్యక్రమంతో వేడుక చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆవు పేడను ఒకరిపై మరొకరు విసురుకుంటూ సందడి సందడిగా గడిపారు.

వందేళ్ల చరిత్ర..

ఈ పండుగలో గ్రామస్థులు శరీర భాగాలకు పేడను పూసుకుంటూ (indian cow dung festival) వేడుక చేసుకుంటారు. అయితే.. కోపాన్ని దరిచేరనీయరు. పేడను విసురుకునేప్పుడు ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గత వందేళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

ఆవు పేడను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించి గ్రామంలోని భీరేశ్వర దేవాలయం వద్ద పోగు చేస్తారు. ఆ ప్రదేశాన్ని రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. పండుగ రోజు అక్కడికి గుంపుగా వెళ్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం పేడను ఒకరిపై మరొకరు విసురుకుంటారు.

indian cow dung festival
గోరాయ్​హబ్బా కార్యక్రమం
indian cow dung festival
ఆవుపేడను విసురుకుంటున్న గ్రామస్థులు

"సంప్రదాయంగా ప్రతి ఏడాది ఈ పండుగను మేము జరుపుకుంటాము. కుల వివక్షకు తావు లేకుండా అందరం కలిసి ఒకే చోట ఈ వేడుకను నిర్వహిస్తాము. కలిసిమెలిసి జీవించాలనే సందేశాన్ని గోరాయ్​హబ్బా ఇస్తుంది."

-మంజునాథ్​, స్థానిక యువకుడు

indian cow dung festival
గోరాయ్​హబ్బా కార్యక్రమంలో ఆవుపేడతో యువకులు

ఇదీ చదవండి:కొరడాలతో కొట్టుకుంటూ.. దీపావళి వేడుకలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.