ETV Bharat / bharat

కాన్వాస్​పై బాడీతో పెయింటింగ్​- ఉదయనిధి స్టాలిన్​కు వినూత్న శుభాకాంక్షలు - ఉదయనిధి స్టాలిన్‌ ఎవరు?

Udhayanidhi Stalin Birthday: చిత్రలేఖనంలో నిష్ణాతుడైన ఓ కళాకారుడు తన అభిమాన నాయకుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్​కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన చిత్రాన్ని కాన్వాస్​పై సరికొత్త పద్ధతిలో గీశాడు. తన శరీరాన్ని కుంచెగా మలచుకుని ఈ ఫీట్​ సాధించి అభిమానాన్ని చాటుకున్నాడు.

Udhayanithi Stalin photo
సెల్వం గీసిన ఉదయనిధి స్టాలిన్​ ఫొటో
author img

By

Published : Nov 27, 2021, 9:26 AM IST

Updated : Nov 27, 2021, 12:09 PM IST

ఉదయనిధి స్టాలిన్​ చిత్రం

Udhayanidhi Stalin Birthday: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పుట్టిన రోజు శనివారం ( నవంబర్​ 27) కాగా.. ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు సెల్వం అనే కళాకారుడు. ఆయన శరీరంపైనే పెయింట్‌ పోసుకుని.. కాన్వాస్​పై అటూ ఇటూ దొర్లుతూ ఉదయనిధి చిత్రాన్ని గీశాడు.

Udhayanithi Stalin photo
సెల్వం గీసిన ఉదయనిధి స్టాలిన్​ చిత్రం

కాళ్లకురిచ్చి జిల్లా తిరుకోవిలూరులోని శివనార్ తంగల్ పంచాయతీ పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రాయింగ్ టీచర్​గా సెల్వం పనిచేస్తున్నాడు. సెల్వ ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తుంటాడని విద్యార్థులతో పాటు.. ఆయన సన్నిహితులు తెలిపారు. సరికొత్త రీతిలో పెయింటింగ్​ చేయడానికి ఆయన ఆసక్తిని కనబరుస్తుంటాడని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఉదయనిధి చిత్రాన్ని గీసినట్లు వెల్లడించారు. అంతకు ముందు కరుణానిధి, స్టాలిన్(mk stalin news), మంత్రి అన్బిల్ మహేష్ వంటి ప్రముఖుల చిత్రాలను గీశారు సెల్వ. అయితే.. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న తనకు శాశ్వత ఉద్యోగాన్ని కల్పించాలని ఆయన కోరుతున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 27, 2021, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.