తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్.. సైక్లింగ్‌పై ఉన్న మక్కువను మరోమారు చాటుకున్నారు. చెన్నై ఈసీఆర్ ప్రాంతంలో సైకిల్‌పై చక్కర్లు కొట్టి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.
పాతే.. కానీ కొత్తగా..
స్టాలిన్‌కు సైక్లింగ్ కొత్తేమీ కాదు. ప్రతిపక్ష నేత హోదాలో అనేకమార్లు ఆయన అదే ఈసీఆర్(ఈస్ట్ కోస్ట్ రోడ్)లో సైక్లింగ్ చేశారు. కానీ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైకిల్ సవారీ ఆయనకు ఇదే తొలిసారి.
ఇదీ చూడండి:- చిన్నారి సాయానికి ఫిదా- సీఎం 'సైకిల్' గిఫ్ట్
ఆదివారం ఉదయం 5:45 గంటలకు ముత్తుకదు వద్ద మొదలుపెట్టి కోవలమ్ వరకు సైకిల్ తొక్కారు సీఎం. దారిపొడవునా భారీ భద్రతా బలగం ఆయన వెన్నంటే వెళ్లింది.
ఈ నేపథ్యంలో తోటి సైక్లిస్ట్‌లతో నవ్వుతూ మాట్లాడారు స్టాలిన్. కోవలమ్‌లోని కేఫ్ 4 యూ టీ స్టాల్లో టీ తాగారు. అక్కడికి వచ్చిన కొందరు సైక్లిస్ట్‌లతో ఫొటోలు దిగారు. సీఎం సైక్లింగ్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి:- ఒలింపిక్స్ విజేతలకు సీఎం బంపర్ ఆఫర్