Sivaji Krishnamurthy Comments On Kushboo : డీఎంకే పార్టీ నేత శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, బీజేపీ నాయకురాలు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 జనవరిలో.. తమిళనాడు గవర్నర్‌ను ఉద్దేశించి శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో డీఎంకే పార్టీ ప్రకటించింది. అయినప్పటికీ, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం వల్ల తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్.. శివాజీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
-
#WATCH | Chennai, Tamil Nadu: Expelled DMK leader Sivaji Krishnamurthy being taken for medical examination
— ANI (@ANI) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He was arrested for his remarks against Tamil Nadu Governor RN Ravi and NCW member Khushbu Sundar https://t.co/IxCSwwbJ94 pic.twitter.com/ATeAizr96e
">#WATCH | Chennai, Tamil Nadu: Expelled DMK leader Sivaji Krishnamurthy being taken for medical examination
— ANI (@ANI) June 18, 2023
He was arrested for his remarks against Tamil Nadu Governor RN Ravi and NCW member Khushbu Sundar https://t.co/IxCSwwbJ94 pic.twitter.com/ATeAizr96e#WATCH | Chennai, Tamil Nadu: Expelled DMK leader Sivaji Krishnamurthy being taken for medical examination
— ANI (@ANI) June 18, 2023
He was arrested for his remarks against Tamil Nadu Governor RN Ravi and NCW member Khushbu Sundar https://t.co/IxCSwwbJ94 pic.twitter.com/ATeAizr96e
ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఖుష్బూను ఉద్దేశిస్తూ శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం చెలరేగింది. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన ఖుష్బూ.. సీఎం స్టాలిన్‌కు దాన్ని ట్యాగ్ చేశారు. శివాజీ తన పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆమె అన్నారు. అవే వ్యాఖ్యలను మీ కుటుంబంలోని మహిళలకు అంటే మీరు ఊరుకుంటారా? అంటూ ఖుష్బూను ఆవేదన వ్యక్తం చేశారు.
"మీకు అర్థం కాని విషయం ఏంటంటే.. శివాజీ కేవలం నన్నే కించపరచడం లేదు. మిమ్మల్ని, మీ తండ్రిగారి లాంటి గొప్ప నేతల్ని సైతం ఆయన అవమానపరుస్తున్నారు. ఆయనకు ఎంత ఎక్కువ చనువు ఇస్తే.. రాజకీయంగా మీరంతా వెనకబడిపోతారు." అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. మీ పార్టీ అనైతిక వ్యక్తులకు స్వర్గధామంలా మారుతోందని స్టాలిన్ ఉద్దేశిస్తూ అన్నారు. ఇది సిగ్గు చేటుని ఆమె వ్యాఖ్యానించారు.
-
சிவாஜி கிருஷ்ணமூர்த்தி போன்ற திமுகவினரை செருப்பால் அடிப்பது என் செருப்புக்கு அசிங்கம் ! pic.twitter.com/4P9JKPIY8E
— Selva Kumar (@Selvakumar_IN) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">சிவாஜி கிருஷ்ணமூர்த்தி போன்ற திமுகவினரை செருப்பால் அடிப்பது என் செருப்புக்கு அசிங்கம் ! pic.twitter.com/4P9JKPIY8E
— Selva Kumar (@Selvakumar_IN) June 18, 2023சிவாஜி கிருஷ்ணமூர்த்தி போன்ற திமுகவினரை செருப்பால் அடிப்பது என் செருப்புக்கு அசிங்கம் ! pic.twitter.com/4P9JKPIY8E
— Selva Kumar (@Selvakumar_IN) June 18, 2023
గవర్నర్ ఆర్ఎన్ రవిపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు
అంతకుముందు 2023 జనవరిలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ డిప్యూటీ సెక్రెటరీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇదే అంశంపై తమిళనాడు బీజేపీ కూడా డీజీపీకి లేఖ రాసింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతున్న వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని.. వారిని కఠినంగా శిక్షించాలని అందులో పేర్కొంది