తమిళనాట జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 234 స్థానాల్లో.. డీఎంకే 160 నుంచి 170 స్థానాలు కైవసం చేసుకుంటుందని.. రిపబ్లిక్ టీవీ సీఎన్ఎక్స్ సర్వే వెల్లడించింది. అన్నాడీఎంకే కూటమికి 58 నుంచి 68 మధ్య స్థానాలు వస్తాయన్న రిపబ్లిక్ టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్.. ఏఎంఎంకే 4 నుంచి 6 స్థానాలు వస్తాయని వెల్లడించాయి. ఇతరులకు 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
పీ మార్క్ సర్వే వివరాలిలా..
పీ మార్క్ సర్వే కూడా కూడా ఇలాంటి అంచనాలే వెల్లడించింది. డీఎంకే 165 నుంచి 190 స్థానాలు కైవసం చేసుకుంటుందని.. అధికార అన్నాడీఎంకే 40 నుంచి 65 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఏఎంఎంకే 1 నుంచి 3 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
టుడేస్ చాణక్య అంచనా..
తమిళనాడులో డీఎంకే భారీ విజయం ఖాయమని టుడేస్ చాణక్య సర్వే తెలిపింది. డీఎంకే 164 నుంచి 186 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అన్నాడీఎంకే 46 నుంచి 68 స్థానాలకే పరిమితమవుతుందని.. ఇతరులకు 0 నుంచి 6 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
ఇండియా టుడే సర్వే..
తమిళనాడులో డీఎంకే భారీ విజయం ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే వెల్లడించింది. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే 175 నుంచి 195 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేసింది. అన్నాడీఎంకేకు 38 నుంచి 54 స్థానాలే వస్తాయని సర్వే వెల్లడించింది. కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకు 2 స్థానాలు వస్తాయని తెలిపిన ఇండియా టుడే-యాక్సిస్ సర్వే.....ఇతరులకు 1 నుంచి 7 స్థానాలు దక్కుతాయని తెలిపింది.
ఇదీ చదవండి: తమిళ పోరు.. కీలక స్థానాల్లో గెలుపెవరిది..?