ETV Bharat / bharat

కరోనా ట్యాబ్లెట్ అని ఇచ్చి కుటుంబంలో ముగ్గురి హత్య - తమిళనాడు ఈరోడ్​లో హత్య

'రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కరోనా నుంచి కాపాడుతుంది' అని చెబుతూ ఇంటికొచ్చి ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆ మాటలను నమ్మి.. ట్యాబ్లెట్లు​ వేసుకోగా ఆ కుటుంబంలోని ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

tamilanadu Erode Two arrested in 'Corona pill' Triple murder case
కరోనా పిల్ ఇచ్చి హత్య
author img

By

Published : Jun 28, 2021, 8:23 PM IST

Updated : Jun 28, 2021, 10:57 PM IST

రోగ నిరోధక శక్తిని పెంచే మందంటూ నకిలీ మాత్రలను పంచి.. ఒకే కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడు ఓ కిరాతకుడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ఈరోడ్​ జిల్లాలో జరిగిందీ ఘటన. అయితే.. అధికారులు దర్యాప్తులో ఓ పెద్ద కుట్రకోణం బయటపడింది.

అసలేమైందంటే..

ఈరోడ్​ జిల్లా కారుగౌండన్​ వాలసు గ్రామానికి చెందిన కారుప్పన్నన్​ అనే రైతు ఇంటికి ఆరోగ్య కార్యకర్తనని చెబుతూ మారువేషంలో ఓ వ్యక్తి శనివారం ఉదయం వచ్చాడు. జ్వరం గానీ, దగ్గుగానీ ఉన్నాయా అని వారిని ఆరా తీశాడు. అయితే.. వారు మాత్రం తమకు అలాంటివేమీ లేవని సమాధానమిచ్చారు. అయినప్పటికీ.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా రాకుండా ఉంటుందని చెబుతూ కొన్ని మాత్రలను ఆ కుటుంబానికి ఇచ్చాడతడు.

corona pill arrest
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అతడు వెళ్లిన తర్వాత కారుప్పన్నన్​ సహా అతని భార్య, అతని ఇంట్లో పని చేసే మరో వ్యక్తి ఆ మందులను తీసుకున్నారు. దాంతో వారు స్పృహ కోల్పోయారని పోలీసులు చెప్పారు. కారుప్పన్​ భార్య మల్లిక అదేరోజు ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఆదివారం కారుప్పన్నన్​ కుమార్తె, పనిమనిషి మృతి చెందారని తెలిపారు. కారుప్పన్నన్​ పరిస్థితి విషమించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని పేర్కొన్నారు.

corona pill arrest
నిందితులు

ప్లాన్​ చేసి...

ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. అయితే.. కారుప్పన్నన్​కు మరో వ్యక్తికి మధ్య ఏర్పడిన భూవివాదమే అతని కుటుంబ సభ్యుల హత్యకు కారణమని అధికారులు గుర్తించారు.

కారుప్పన్నన్​ భూమిని కొనుగోలు చేసిన నిందితుడు చాలా కాలం నుంచి అతడికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కారుప్పన్నన్​ను హత్య చేస్తే డబ్బులు ఇచ్చే బాధ తప్పుతుందని భావించి అతడి కుటుంబాన్ని అంతమొందించాలని కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. అందులో భాగంగా ఈ నకిలీ ఆరోగ్య అధికారిని పంపించి.. విషపూరిత మాత్రలు అందజేశాడని చెప్పారు.

నిందితులను మేజిస్ట్రేట్​ ముందు పోలీసులు హాజరుపరచగా.. వారికి 15 రోజుల జుడీషియల్​ కస్టడీ విధించారు.

ఇదీ చూడండి: Live Video: యువకుడ్ని గుద్ది చంపిన ఎద్దు

ఇదీ చూడండి: Live Video: బైక్​లో దూరిన పాముపై కర్కశత్వం

Last Updated : Jun 28, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.