ETV Bharat / bharat

కాఫీ షాపులో 'కరోనా పాలు'- టేస్ట్ చేసేందుకు ఎగబడుతున్న జనం

Tamil nadu youngster Coffee shop: కరోనా సృష్టించిన పరిస్థితులను తమ వ్యాపారానికి అనువుగా మలుచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు కూడా ఇదే పంథాను అనుసరించి.. మంచి లాభాలను గడిస్తున్నాడు. అతడి కాఫీ షాపులో టీ, కాఫీ, పాలను తాగేందుకు జనం పోటెత్తుతున్నారు. ఇంతకీ ఆ కాఫీ షాపు ప్రత్యేకత ఏంటంటే..?

Interesting recipe in corona time
మధురైలో కరోనా పాలు అందించే కాఫీ షాపు
author img

By

Published : Dec 4, 2021, 10:51 AM IST

Updated : Dec 4, 2021, 2:20 PM IST

కాఫీ షాపులో 'కరోనా పాలు'

Tamil nadu youngster Coffee shop: ప్రపంచాన్ని రెండేళ్లుగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పుడు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ వ్యాప్తి మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. కొవిడ్ కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ, ఈ కరోనా కల్లోలంలోనూ కొంత మంది విభిన్నంగా ఆలోచించి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన సొలోమాన్ రాజ్​ ఒకడు.

Coffee shop with jaggery: సొలోమాన్​ రాజ్ మధురైలో​ 'సాయా కారుపట్టి కాపీ' పేరుతో ఓ కాఫీ షాపును నిర్వహిస్తున్నాడు. కాఫీ, టీ అంటే ఎక్కడైన చక్కెరనే వినియోగిస్తారు. కానీ, సొలోమాన్​ రాజ్ షాపులో మాత్రం ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే.. ఈ షాపులో దొరికే కాఫీ, టీ, పాలలో పంచదారను వాడరు. దానికి బదులుగా బెల్లాన్ని వినియోగిస్తారు.

Interesting recipe in corona time
'సాయా కారుపట్టి కాపీ' కాఫీ షాపు
Interesting recipe in corona time
'సాయా కారుపట్టి కాపీ' కాఫీ షాపులో వివిధ రకాల స్నాక్స్, డ్రింకులు
Interesting recipe in corona time
'సాయా కారుపట్టి కాపీ' కాఫీ షాపులో వినియోగదారులు

పాత రోజుల్లో కాఫీ, పాలు, టీలలో బెల్లాన్నే వినియోగించేవారని.. కానీ, ఆ తర్వాతే చక్కెర వినియోగం పెరిగిందని చెప్పాడు సొలోమోన్​ రాజ్​. పంచదార కంటే బెల్లాన్ని వాడితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనరం అని అతను అంటున్నాడు. కొవిడ్​ను ఎదుర్కోవాలంటే పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నందున ఇలా కాఫీ, టీలను తాగితే ఆరోగ్యానికి మంచిదని అతను చెబుతున్నాడు.

corona milk
సొలోమాన్ రాజ్​, కాఫీ షాపు యజమాని

"బెల్లం శరీరానికి కాల్షియాన్ని అందిస్తుంది. అందుకే మేం మా షాపులో టీ, కాఫీ, పాల కోసం మామాలు పంచదారకు బదులుగా బెల్లాన్ని, నాటు చెక్కరను వినియోగిస్తాం. దీన్ని మా కస్టమర్లు ఎంతో ఇష్టపడుతారు."

-సొలోమాన్ రాజ్​, కాఫీ షాపు యజమాని.

కరోనా పాలు ఫుల్​ ఫేమస్​!

Corona Milik: ఇటీవల కాలంలో 'సాయా కారుపట్టి కాపీ' షాపులో 'కరోనా పాల'కు డిమాండ్ బాగా పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ షాపులో కరోనా పాలను వినియోగదారులు తాగుతున్నారు.

corona milk
'సాయా కారుపట్టి కాపీ' కాఫీ షాపు

"మేం మా షాపులో కరోనా పాలు అనే కొత్త రెసిపీని పరిచయం చేశాం. అందులో ప్రధాంగా పసుపును వినియోగిస్తాం. ఎండు అల్లం, బెల్లం కలిపి దాన్ని తయారు చేస్తాం. వేరు శనగ నూనెలో మినప వడ కూడా మా దగ్గర ఎంతో ఫేమస్​. మా వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నందుకు మేం చాలా సంతృప్తిగా ఉన్నాం."

-సొలోమాన్ రాజ్​, కాఫీ షాపు యజమాని.

అచ్చంపాతు రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు ఈ షాపు వద్ద ఆగి.. ఇక్కడ పోషకాలను అందించే వివిధ రకాలు స్నాక్స్​, డ్రింకులను టేస్ట్ చేస్తున్నారు. అవి తాగి ఎంతో బాగుందని మురిసిపోతున్నారు.

ఇదీ చూడండి: బద్రీనాథ్​ను కప్పేసిన మంచుదుప్పటి.. హిమాచల్​లోనూ హిమపాతం

ఇదీ చూడండి: Mystery Well: 'మాయా బావి' గుట్టు తేల్చే పనిలో పరిశోధకులు

Last Updated : Dec 4, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.