ETV Bharat / bharat

విద్యార్థులపై ఉపాధ్యాయురాలి​ లైంగిక వేధింపులు.. కుమారుడిని కూడా.. - పోక్సో చట్టం

Teacher Sexual Abuse: పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలే అడ్డదారి తొక్కింది. ట్యూషన్లకు వచ్చిన విద్యార్థుల్లో టీనేజీ వయసు ఉన్న వారికి మాయమాటలు చెప్పి వారిని లైంగికంగా వేధించేది. కుమారుడిని కూడా వదలలేదు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ద్వారా బయటపడింది.

Tamil Nadu
టీనేజీ
author img

By

Published : Apr 5, 2022, 2:35 PM IST

Teacher Sexual Abuse: పాఠాలతో విద్యార్థులకు సరైన దారి చూపించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా ప్రవర్తించింది. ట్యూషన్లకని వచ్చిన విద్యార్థులను లైంగికంగా వేధించేది. ఈ ఘటన తమిళనాడు మధురై​ జిల్లా బెతానియాపురమ్​ ప్రాంతంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితురాలు సహా ఆమె బాయ్​ఫ్రెండ్​ వీరమణిని (39) అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్​గా పనిచేసే నిందితురాలికి వీరమణి అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త కొంతకాలం క్రితం ఆమెకు విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రియుడితో మరింత సాన్నిహిత్యం పెంచుకున్న నిందితురాలు.. వీరమణి ప్రభావంతో పోర్న్​ చిత్రాలకు బానిసైంది. ఈ క్రమంలో ట్యూషన్లకు వచ్చిన విద్యార్థులతో లైంగిక వాంఛ తీర్చుకోవాలని భావించింది. అసభ్యకరమైన చిత్రాలను పంపుతూ వారిని ముగ్గులోకి దింపి లైంగికంగా వేధించేది. ఈ వేధింపులకు ఆమె కుమారుడు కూడా బాధితుడే.

విద్యార్థులపై టీచర్​ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వీడియోను వీరమణి సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. ఈ వీడియో నిందితురాలి బంధువు దృష్టికి రావడం వల్ల అసలు విషయం బయటపడింది. విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని, ఆమె ప్రియుడు వీరమణిని అరెస్ట్​ చేశారు. నిందితురాలి నుంచి సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​, కంప్యూటర్లను సీజ్​ చేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : ఆమెకు ఎయిడ్స్​.. అయినా 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం.. పాపం ఆ చిన్నోడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.