బీమా డబ్బులు రూ.3 కోట్ల కోసం భర్తను చంపిన ఘటనలో భార్యను, దగ్గరి బంధువును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని తుడుపతి పట్టణానికి చెందిన రంగరాజన్( 60)అనే వ్యక్తి పవర్లూమ్ యజమాని. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడు. కాలు గాయమై గత నెలలో ఆసుపత్రిలో చేరాడు. గురువారం డిశ్ఛార్జ్ చేయగా.. ఆయన భార్య జ్యోతిమయి(55), దగ్గరి బంధువు కలిసి కారులో తుడుపతిలో ఉన్న ఇంటికి తీసుకువస్తున్నారు.
మార్గ మధ్యలో ముందే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం భర్తను కారులోనే ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనుకోకుండా కారులో మంటలు చెలరేగి తన భర్త చనిపోయాడని పోలీసులకు జ్యోతిమయి కట్టుకథలు చెప్పింది. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం.. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగరాజన్‌ను ఆయన భార్య, దగ్గరి బంధువు కలిసి హత్య చేశారని తేలింది.
ఇదీ జరిగింది: వేర్వేరు అగ్నిప్రమాదాల్లో ముగ్గురు మృతి