దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 22,651 కేసులు నమోదయ్యాయి. 466 మంది ప్రాణాలు కోల్పోయారు. 33,646 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 523 కేసులు వెలుగులోకి వచ్చాయి. 50 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో 14,152 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 289 మంది చనిపోయారు.
- కేరళలో 16,229 కేసులు నమోదయ్యాయి. 135 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో 16,068 కేసులు బయటపడ్డాయి. 364 మంది మరణించారు.
- ఒడిశాలో 7,729 కేసులు బయటపడ్డాయి. 39 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
- ఉత్తర్ప్రదేశ్లో కొత్తగా 1,175 మందికి కరోనా సోకగా.. మరో 136 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు 22.75 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.