తమిళనాడులోని (Tamil nadu rainfall) పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో (Tamilnadu weather today) ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం, పుడుకొట్టాయ్, నాగపట్టణం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మదురైలో ముఖ్యంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. ట్రాఫిక్ స్తంభించింది.
కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్‌కాశీ, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో సాధారణ వర్షం కురుస్తుందని వెల్లడించింది. కావేరీ డెల్టా సహా 15కు పైగా జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు ముంచెత్తవచ్చని హెచ్చరించింది.
సెలవులు..
రాష్ట్రవ్యాప్తంగా మరో 5 రోజుల వరకు వర్షాలు తగ్గకపోవచ్చని ఐఎండీ (IMD rain forecast) అంచనా వేసింది. తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పట్టుల్లో రాబోయే రోజుల్లో వానలు కురవనున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో తూత్తుకుడి, దిండిగల్, థేని, పెరంబలూర్, తంజావూర్, టెన్‌కాశీ, తిరునల్వేలి సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు (Rain holiday today) ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు లేకపోవడంతో.. ప్రభుత్వం సెలవుల్ని పొడగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
ఇదీ చూడండి: viral video: కదులుతున్న రైలు ఎక్కేందుకు విద్యార్థిని స్టంట్స్