ETV Bharat / bharat

మూడు రోజుల క్రితమే పెళ్లి.. కూతురు, అల్లుడిని కొడవలితో నరికి హత్య - పరువు హత్య తూతుక్కుడి తమిళనాడు

Tamil Nadu Honour killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురిని దారుణంగా నరికి చంపేశాడు ఓ వ్యక్తి. ఆమె వివాహం చేసుకున్న యువకుడిని సైతం హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఇదే రాష్ట్రంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సరిగా చదవలేకపోతున్నాననే ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంది.

Love couple hacked to death
Love couple hacked to death
author img

By

Published : Jul 26, 2022, 3:58 PM IST

Updated : Jul 26, 2022, 5:00 PM IST

Tamil Nadu Honour killing: తమిళనాడులో పరువు హత్య కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తన కూతురు, అల్లుడిని దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి ఇద్దరినీ కొడవలితో నరికి చంపేశాడు. తూతుక్కుడిలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఎట్టయాపురానికి చెందిన ముతుకుట్టి(50) కూతురు రేష్మ(20).. కోవిల్​పట్టిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో ఉండే మనికరాజ్(26)తో రేష్మ ప్రేమలో పడింది. వీరిద్దరికీ దూరపు చుట్టరికం సైతం ఉంది. వీరిద్దరి ప్రేమ గురించి మనికరాజ్​కు తెలిసింది. అయితే, ఈ ప్రేమను అతడు ఒప్పుకోలేదు. తొలి నుంచీ తీవ్రంగా వ్యతిరేకించాడు.

Love couple hacked to death
రేష్మ, మనికరాజ్

కుటుంబ సభ్యుల మద్దతు లేకుండానే రేష్మ, మనికరాజ్ వివాహం చేసుకున్నారు. గత శనివారం (జులై 23న) దండలు మార్చుకున్నారు. అనంతరం, వేరే ఇంట్లో కాపురం పెట్టారు. ప్రేమిస్తున్నానని చెబితేనే ఒప్పుకోని ముతుకుట్టి.. వివాహం జరిగిన విషయాన్ని తెలుసుకొని కోపంతో ఊగిపోయాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రేష్మ, మనికరాజ్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి వారిపై దాడి చేశాడు. కొడవలితో దారుణంగా హత్య చేశాడు.

Love couple hacked to death
వివాహం చేసుకున్న యువతీ యువకుడు

మూడు గంటల్లో అరెస్ట్
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం కోవిల్​పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు గంటల్లోనే నిందితుడు ముతుకుట్టిని అరెస్ట్ చేశారు.

Love couple hacked to death
నిందితుడు ముతుకుట్టి

తల్లిదండ్రులు, చిన్నారిని హత్య చేసి..
ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను, నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడు సౌరభ్(22).. సోమవారం రాత్రి తన తండ్రి ఓం ప్రకాశ్(62), తల్లి సోమవతి(60), బాలిక శివ(4)ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఓంప్రకాశ్ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. పెద్దకుమారుడి వ్యాయామశాల కోసం డబ్బులు సమకూర్చిన ఆయన.. నిరుద్యోగి అయిన చిన్నకుమారుడు సౌరభ్​కు ఎలాంటి సాయం చేయలేదని.. అందుకే యువకుడు అందరినీ హత్య చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. సౌరభ్ తల్లిదండ్రులు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. బాలిక శివ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిందని పేర్కొన్నాయి.

మరో విద్యార్థిని ఆత్మహత్య
తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కడలూర్ జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వృందాచలం ప్రాంతానికి చెందిన గోపి-ఇళవరసి దంపతుల రెండో కుమార్తె.. స్కూల్ నుంచి తిరిగి వచ్చి ఊరేసుకొని చనిపోయింది. బాలిక ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతోంది. సోమవారం పరీక్షలు రాసి తీవ్ర నిరాశతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని రాత్రి 9గంటలకు ఉరి వేసుకుంది.

tamil nadu student suicide
చనిపోయిన బాలిక

పనికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగానే.. బాలిక విగతజీవిగా కనిపించింది. బాలికకు అంత్యక్రియలు చేస్తుండగా సమాచారం అందుకొని వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె చాలా ట్యాలెంట్ ఉన్న విద్యార్థిని అని మృతురాలి తల్లి ఇళవరసి చెప్పారు. కొద్దిరోజుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని అన్నారు. సరిగా చదవలేకపోతున్నానని బాధపడుతుండేదని చెప్పారు.

గర్భిణీకి వేధింపులు..
రాజస్థాన్ భరత్​పుర్ ప్రాంతంలోని కామా ప్రాంతంలో కొంతమంది యువకులు గర్భిణీని వేధింపులకు గురిచేశారు. గుర్తు తెలియని మహిళ పోర్న్ వీడియోను సర్కులేట్ చేస్తూ తనను వేధించారని బాధితురాలు ఆరోపించారు. ఐదు నెలలుగా వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. స్థానిక పోలీసులు సరైన చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ ఎస్పీని ఆశ్రయించారు బాధితులు. కారుణ్య మరణానికి అనుమతించాలని ఎస్పీని అభ్యర్థించారు. ఘటనపై స్పందించిన ఎస్పీ శ్యామ్ సింగ్.. కేసును వెంటనే దర్యాప్తు చేయాలని కామా పోలీస్ స్టేషన్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 26, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.