సంక్రాంతి వేళ జల్లికట్టు పోటీల నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొవిడ్ దృష్ట్యా కొన్ని ఆంక్షల మధ్య ఆట నిర్వహించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో 150 మందికి మించి ఆటగాళ్లు పాల్గొనవద్దని ఆదేశించింది. కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించిన ఆటగాడినే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
ప్రేక్షకులు సైతం 50శాతం కంటే మించరాదని షరతు విధించింది తమిళనాడు ప్రభుత్వం.
ఇదీ చదవండి : 24 కి.మీ వెనక్కి దూసుకెళ్లిన రైలు- ఆపై బోల్తా