ETV Bharat / bharat

స్టాలిన్ శకారంభం.. డీఎంకే 155 స్థానాలు కైవసం - tamil nadu elections dmk win

తమిళనాడులో డీఎంకే అఖండ విజయం సాధించింది. 155 స్థానాల్లో గెలిచిన డీఎంకే కూటమి మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా, జయలలిత లాంటి ఆకర్షణీయమైన నేతలు ఎవరూ లేనప్పటికీ అన్నాడీఎంకే 72 స్థానాల్లో గెలుపొంది... బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.

tamil-nadu-assembly-elections-dot-dmk-bags-155-seats-in-tn-polls
స్టాలిన్ శకారంభం.. డీఎంకే 155 స్థానాలు కైవసం
author img

By

Published : May 3, 2021, 5:35 AM IST

తమిళనాడులో గత లోకసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన డీఎంకే తాజా శాసనసభ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించింది. ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి వారసుడు 'దళపతి' ఎం.కె.స్టాలిన్(68) ముఖ్యమంత్రి కానున్నారు. శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు కావాల్సి ఉంది. మిత్రపక్షాలు కాకుండా డీఎంకే ఒక్కటే 131 స్థానాల్లో గెలుపు, ఆధిక్యం సంపాదించి సర్కారు నడపడానికి అవసరమైన మెజార్టీని పొందింది. ఇతర మిత్రపక్షాలతో కలిసి 157 సీట్లు లభించే అవకాశం ఉంది. 155 సీట్లలో గెలిచిన ఈ కూటమి.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

గట్టి పోటీ

పోటీ ఏకపక్షంగా ఉంటుందని తొలుత కొన్ని వర్గాలు భావించినా, ఇంతవరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే గట్టి పోటీనే ఇచ్చింది. జయలలితలాంటి ఆకర్షణీయమైన నేతలు ఎవరూ లేనప్పటికీ 72 స్థానాల్లో గెలుపొందింది. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ కూటమికి మొత్తంగా 74 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు అందిన లెక్కల ప్రకారం డీఎంకే 37.6 % ఓట్లను సంపాదించగా, అన్నాడీ ఎంకే 33.4 % ఓట్లను పొందడం గమనార్హం. డీఎంకేతో పొత్తు పెట్టు కున్న కాంగ్రెస్ 16 చోట్ల విజయం సాధించింది.

ప్రభావం చూపని కమల్

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ నెల కొల్పిన మక్కల్ నీది మయ్యం ఎక్కడా ప్రభావం చూపలేదు. ఆయనే కోయంబత్తూరు దక్షిణ నియో జకవర్గంలో భాజపా అభ్యర్థి వాసంతీ శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. కొలత్తూర్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన స్టాలిన్ 92,868 ఓట్ల ఆధిక్యతతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.సంబత్ కుమాపై గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇదేనని పార్టీ వర్గాలు తెలిపాయి. కరుణానిధి కుటుంబంలోని మూడో తరం కూడా ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి చెన్నై నగరంలోని చేపక్ ట్రిప్లికేన్​లో గెలుపొందారు. చెన్నై నగరంలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ఖుష్బూ సుందర్ ఓటమి పాలయ్యారు.

డీఎంకే రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో అన్నాడీఎంకే కొంగు, కోయంబత్తూరు ప్రాంతాల్లో తమ పట్టు నిలుపుకొన్నాయి. కనిష్ఠంగా 18 రౌండ్లు, గరిష్ఠంగా 48 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగడంతో ఫలితాలు రాకలో ఆలస్యమయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.