భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. 'రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని' ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని.. ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించింది.
వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండురోజుల పాటు సెలవులను ప్రకటించింది. విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు.
ఇవీ చదవండి: