ETV Bharat / bharat

7 నెలల గర్భిణి అదిరే ఫీట్లు- మెరుపు వేగంతో కర్రసాము

గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా అలసటకు గురయ్యే అవకాశముంటుంది. అందుకే కఠినమైన పనులకు దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఏడు నెలల గర్భిణి ఇందుకు భిన్నంగా మెరుపు వేగంగా కర్రసాము చేస్తూ.. ఔరా అనిపిస్తోంది.

author img

By

Published : Sep 30, 2021, 3:46 PM IST

pregnant woman in Silambam
7 నెలల గర్భిణి అదిరే ఫీట్లు
7 నెలల గర్భిణి అదిరే ఫీట్లు

తమిళనాడు నమక్కల్​ జిల్లా కనవాయిపట్టికి చెందిన స్నేహ.. ఏడు నెలల గర్భిణి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఈమె.. రెండు చేతులతో కర్రసాము చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెరుపు వేగంతో కర్ర తిప్పుతూ.. ఔరా అనిపిస్తోంది. రెండు చేతులతో ఒక గంటకుపైగా కర్రసాము చేసి.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్సులో చోటు దక్కించుకోవాలన్నది ఈమె కల. దీని కోసం తన గర్భాన్ని కూడా లెక్క చేయకుండా రోజూ సాధన చేస్తోంది.

pregnant woman in Silambam
స్నేహ
pregnant woman in Silambam
ఏడు నెలల గర్భంతో కర్రసాము సాధన చేస్తున్న స్నేహ

స్నేహకు చిన్నప్పటినుంచి సిలంబం(మార్షల్​ ఆర్ట్స్​​) అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే తన భర్త నవీన్​ సాయంతో కర్రసాము నేర్చుకుంది. స్థానికంగా జరిగే కర్రసాము పోటీల్లో కూడా పాల్గొంటోంది. గర్భిణి అయిన స్నేహ.. రెండు చేతులతో ఒక గంటపాటు సిలంబం స్టంట్ చేసి రికార్డు సృష్టించింది. కలామ్స్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది.

"చిన్నతనంలో గ్రామదేవత ఉత్సవాలలో సిలంబంను ఆసక్తిగా చూసేదాన్ని. ఇప్పుడు నా భర్త నవీన్ సాయంతో కర్రసాము నేర్చుకున్నాను. నేను సిలంబం ప్రారంభించిన మొదట్లో ఒళ్లంతా నొప్పిగా అనిపించేది. కానీ, రెండు వారాల్లో దాన్ని అధిగమించాను. ఇది నన్ను మరింత దృఢంగా చేసింది.''

- స్నేహ

స్నేహ-నవీన్​ దంపతులు.. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నవీన్​ సిలంబం శిక్షకుడు. స్నేహితుల సాయంతో ఏకలవ్య ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తున్నాడు. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే కర్రసాము నేర్చుకోవాలనే ఆసక్తి కనబరిచిన స్నేహకు సిలంబం నేర్పించాడు నవీన్​.

pregnant woman in Silambam
రెండుచేతులతో కర్రసాము చేస్తున్న స్నేహ

"నా భార్య స్నేహకు దశలవారీగా సిలంబం నేర్పించాను. ఇందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రెండు చేతులతో దాదాపు గంటపాటు సిలంబం చేసి రికార్డు సృష్టించింది. వైద్యుల సలహా తీసుకున్న తర్వాతనే ఆమె పోటీలో పాల్గొంది."

- నవీన్, స్నేహ భర్త

కేంద్ర ప్రభుత్వం 'ఖేలో ఇండియా'లో భాగంగా సిలంబంను గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు నవీన్​. అలాగే రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో సిలంబం శిక్షకులను నియమించి.. విద్యార్థులకు మార్షల్​ ఆర్ట్స్​ నేర్పించేలా ప్రోత్సహించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరాడు.

ఇదీ చూడండి: చేతికర్రతోనే చిరుతను తరిమికొట్టిన బామ్మ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.