ఉత్తర్‌ప్రదేశ్‌లో బారియా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ పేరును త్వరలో రామ్ మహల్ లేదా శివ మహల్‌గా మారుస్తామని శనివారం వ్యాఖ్యానించారు.
భారతీయ సంస్కృతిని ముస్లిం పాలకులు నాశనం చేశారని సురేంద్ర సింగ్ ఆరోపించారు. అయితే.. ఇప్పుడు ఆ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వర్ణశకం వచ్చిందని అన్నారు. శివాజీ వంశానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తాజ్ మహల్ పేరును తప్పక మారుస్తారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యశ్వంత్ సిన్హా చేరిక తృణమూల్‌కు లాభమా?