ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ సందర్శనకు టికెట్ ధరను పెంచాలని నిర్ణయించింది ఆగ్రా అధికార యంత్రాంగం. స్వదేశీ పర్యటకులకు రూ. 30, విదేశీ పర్యటకులకు రూ.100 టికెట్ ధరను పెంచుతున్నట్లు పేర్కొంది.
ఇంతకుముందు తాజ్ మహల్‌ను సందర్శించేందుకు స్వదేశీ పర్యటకులు రూ. 50, విదేశీ పర్యటకులు రూ. 1100 చెల్లించేవారు.
తాజ్‌మహల్ డోమ్‌ను ప్రత్యేకంగా సందర్శించించేవారికి రూ. 200 ఛార్జ్ విధించనున్నట్లు ఆగ్రా అభివృద్ధి అథారిటీ పేర్కొంది. అయితే.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కూడా ప్రధాన డోమ్‌ను సందర్శించే పర్యటకుల నుంచి రూ. 200 టికెట్టు ధర వసూలు చేస్తుందని ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా స్పష్టం చేశారు.
పెంచిన టికెట్టు ధర ప్రకారం... మెయిన్ డోమ్‌ను సందర్శించే స్వదేశీయులు రూ. 480, విదేశీ యాత్రికులు రూ. 1600 చెల్లించాల్సి ఉంది.