ETV Bharat / bharat

సువేందు అధికారి తండ్రికి 'వై ప్లస్'​ భద్రత - దివ్యేందు అధికారికి భద్రత

బంగాల్​ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తండ్రి, శిశిర్​ కుమార్ అధికారికి, సోదరుడు దివ్యేందు అధికారికి 'వై ప్లస్​' భద్రతను కల్పించింది కేంద్రం హోం శాఖ. వీరిద్దరికీ ముప్పు పొంచిఉందని కేంద్ర నిఘా వర్గాలు తమ నివేదికలో వెల్లడించగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

sisir adhkikari
సువేందు అధికారి తండ్రి
author img

By

Published : May 22, 2021, 2:29 PM IST

బంగాల్​ భాజపా నేత సువేందు అధికారి తండ్రి, సోదరుడికి కేంద్రం హోం మంత్రిత్వ శాఖ.. 'వై ప్లస్​' భద్రతను కల్పించింది. పార్లమెంటు సభ్యులైన.. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి, సోదరుడు దివ్యేందు అధికారికి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు తమ నివేదించగా.. కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాయి.

కాంతి లోక్​సభ స్థానానికి శిశిర్​ కుమార్ అధికారి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. దివ్యేందు అధికారి తాముల్క్​ లోక్​సభ​ స్థానానికి టీఎంసీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ.. భౌతిక బెదిరింపులకు గురయ్యే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు కేంద్రానికి సమర్పించిన తమ నివేదికలో పేర్కొన్నాయి.

ఇప్పటికే.. బంగాల్​ అసెంబ్లీ ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారికి 'జెడ్'​ కేటగిరీ భద్రతను సీఆర్​పీఎఫ్​ అందిస్తోంది. ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నియోజకవర్గంలో భాజపా తరఫున పోటీ చేసిన సువేందు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విజయం సాధించారు.

ఇదీ చూడండి: బంగాల్​ భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర భద్రత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.