బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సువేందు అధికారిని ఎన్నుకుంది భాజపా. బంగాల్లో 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజపాకు.. అసెంబ్లీలో సువేందు అధికారి సారథ్యం వహించనున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం.. భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు పేరును కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే భాజపా తీర్థ పుచ్చుకున్న.. సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ దీదీపై విజయం సాధించిన సువేందు వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది.
ఇదీ చూడండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదా!