ETV Bharat / bharat

నందిగ్రామ్​లో ఓటు వేసిన సువేందు అధికారి

బంగాల్​లోని నందిగ్రామ్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యావత్​ దేశమంతా నందిగ్రామ్​వైపు చూస్తున్నందున.. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు రావాలని కోరారు.

Suvendu Adhikari
నందిగ్రామ్​లో ఓటు వేసిన సువేందు అధికారి
author img

By

Published : Apr 1, 2021, 9:30 AM IST

బంగాల్​లో రెండో దశ పోలింగ్​లో భాగంగా.. నందిగ్రామ్​ భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయకర్​ ప్రాథమిక పాఠశాల పోలింగ్​ బూత్​ నెం.76లో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు.

నందిగ్రామ్​లో ఓటు వేసేందుకు వెళ్తున్న సువేందు అధికారి

"దేశం మొత్తం నందిగ్రామ్ వైపు చూస్తున్నందున.. ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుతున్నాను. అభివృద్ధి రాజకీయాలు గెలుస్తాయా? అసంతృప్తి కలిగించే రాజకీయాలు గెలుస్తాయా? అని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు."

-సువేందు అధికారి, భాజపా నేత

ఎనిమిది దశల బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి నందిగ్రామ్​ పోలింగ్​ కేంద్రాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ- భాజపా నేత సువేందు అధికారి ఇక్కడ బరిలోకి దిగడం వల్ల పోరు రసవత్తరంగా మారింది.

ఇదీ చూడండి:మమతXసువేందు: 'మెగా వార్​' విజేత ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.