ETV Bharat / bharat

గొంతులో ఆహారం ఇరుక్కుని ఎమ్మెల్యే కూతురు మృతి - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్​

Suspicious Death Of Mla Daughter ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే కూతురు.. మధ్యప్రదేశ్​ భోపాల్​లో అనుమానస్పద రీతిలో మరణించింది. ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోవడం వల్లే ఊపిరాడక మరణించినట్లు శవపరీక్ష నివేదికలో తేలింది.

suspicious death of mla daughter
suspicious death of mla daughter
author img

By

Published : Aug 27, 2022, 5:32 PM IST

Suspicious Death Of Mla Daughter: ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే కూతురు పూనమ్ మౌర్య అనూహ్య రీతిలో మరణించారు. ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోవడం వల్లే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కూతురే పూనమ్ మౌర్య. భోపాల్​లోని అయోధ్య నగర్​లో పూనమ్ నివసిస్తున్నారు. 2017లో సంజయ్​ మౌర్య అనే సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​తో ఆమెకు వివాహం జరిగింది. గురువారం ఉదయం సంజయ్​ నిద్రలేచేసరికి పూనమ్.. మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. దీంతో అప్రమత్తమైన సంజయ్​.. పూనమ్​ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల హుటాహుటిన హమీడియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు. కేసు తీవ్రత దృష్ట్యా శవపరీక్షను వీడియో తీశారు. ఈ పరీక్షలో ఆహారం గొంతులో ఇరుక్కుపోయి.. శ్వాస ఆడక పూనమ్ ప్రాణాలు కోల్పోయారని తేలింది.

ఇవీ చదవండి: దుమ్మురేపిన వందే భారత్‌, ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిమీ వేగం

ఆశీర్వాదం పేరుతో స్వామీజీ లైంగిక వేధింపులు, బాలికలను గదిలోకి పిలిచి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.