మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా సుప్రీం బసెలియోస్ మార్తోమా పాలోస్-II(74) తుది శ్వాస విడిచారు. ఇటీవలే అయన కరోనా బారిన పడ్డారు. కరోనా అనంతరం వచ్చే అనారోగ్య సమస్యలతో కేరళ, పథనంతిట్టా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పాలోస్-II కన్నుమూశారు. ఈ మేరకు ఆ చర్చి ప్రతినిధి ఒకరు తెలిపారు. బసెలియోస్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
బసెలియోస్ 2019 నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు చర్చి ప్రతినిధి పేర్కొన్నారు.
2010లో మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా సుప్రీంగా బాధ్యతలు చేపట్టారు బసెలియోస్.
ఇదీ చూడండి: సీజనల్ వ్యాధులకు ఈ జాగ్రత్తలతో చెక్!