ETV Bharat / bharat

'ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం!' - సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులపై కేసులు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ విభాగాలు నమోదు చేసిన కేసుల విచారణలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కేసుల్లో శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించడంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది ధర్మాసనం.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 25, 2021, 12:52 PM IST

వివిధ కేసుల్లో శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించడంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. అలాంటి నేతలపై జీవిత కాల నిషేధం గురించి గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో జాప్యాన్ని నివారించాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.

ప్రజా ప్రతినిధులపై కేసుల దర్యాప్తులో జాప్యాన్ని నివారించాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విచారణలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు నేతలపై కేసుల విచారణ 10 నుంచి 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటోందని వ్యాఖ్యానించింది. ఈ రెండు దర్యాప్తు సంస్ధలు కేవలం ఆస్తులను జప్తు చేసి సరిపెడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది.

అదే ప్రధాన సమస్య..

విచారణ సందర్భంగా అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా.. ప్రజా ప్రతినిధులపై కేసుల వివరాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. మనీ లాండరింగ్‌ కేసుల్లో 51 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నట్లు నివేదించారు. మరో 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నిందితులుగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్‌ క్యూరీ వివరించారు. 58 పెండింగ్ కేసుల్లో జీవితఖైదు శిక్షలు విధించతగినవని, 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని తెలిపారు.

దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. మానవ వనరుల కొరతను ప్రస్తావించారు. విచారణ సంస్థలు కూడా మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ సీబీఐ విచారణ కోరుతున్నారని అన్నారు.

ఇదీ చదవండి: విచారణకు సహకరించకుంటే నిందితుడి బెయిల్‌ రద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.